iDreamPost
android-app
ios-app

Revanth Reddy: విద్యార్థుల కోసం రేవంత్ సర్కార్ సరికొత్త పథకం… ఇక అన్నీ ఒక్క చోటే..!

  • Published Jun 24, 2024 | 10:38 AM Updated Updated Jun 24, 2024 | 10:38 AM

సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొస్తున్న రేవంత్‌ సర్కార్‌.. విద్యార్థుల కోసం అద్భుతమైన స్కీమ్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఆ వివరాలు..

సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొస్తున్న రేవంత్‌ సర్కార్‌.. విద్యార్థుల కోసం అద్భుతమైన స్కీమ్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఆ వివరాలు..

  • Published Jun 24, 2024 | 10:38 AMUpdated Jun 24, 2024 | 10:38 AM
Revanth Reddy: విద్యార్థుల కోసం రేవంత్ సర్కార్ సరికొత్త పథకం… ఇక అన్నీ ఒక్క చోటే..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలనలో తనదైన మార్క్‌ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ఓవైపు ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూనే.. మరోవైపు సంచలన నిర్ణయాలతో ప్రగతి పథంవైపు అడుగులు వేస్తున్నారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమ కోసం రకరకాల పథకాలు తీసుకువస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ఇప్పటి వరకు మహిళలు, రైతులు, పేదల కోసం రకరకాల పథకాలు ప్రకటించడమే.. వాటన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది రేవంత్‌ సర్కార్‌. ఈ క్రమంలో తాజాగా విద్యార్థుల కోసం సరికొత్త స్కీం అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఆ వివరాలు..

విద్యార్థుల కోసం రేవంత్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. సమీకృత రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అధికారంలోకి వచ్చిన మొదట్లోనే రేవంత్‌ సర్కార్‌ దీనిపై.. లోతుగా అధ్యాయన జరిపింది. గత ప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వేరు వేరుగా గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు వాటన్నింటి ఒకే ప్రాంగణంలోకి తీసుకురావాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది.

ఈ క్రమంలో ఈ నిర్ణయాన్ని అమలు చేయటంలో వచ్చే ఆచరణాత్మక సమస్యలపై.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు వివిధ శాఖల అధికారులు లోతుగా చర్చించినట్లుగా సమాచారం. విశాలమైన ప్రాంగణంలో ఒకే చోట ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్వహించడంలో ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలపై చర్చించేందుకుగాను.. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు అవసరమయ్యే.. తరగతి గదులు, హాస్టళ్లు, అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్, సిబ్బందికి క్వార్టర్స్ తదితరాలన్నింటిపై ఈ సమీక్షా సమావేశంలో సుదీర్ఘంగా చర్చింనట్లు తెలుస్తోంది. అన్ని అనుకూలిస్తే.. త్వరలోనే ఈ నిర్ణయం ఆచరణ సాధ్యం కానుందని సమాచారం.

ముందుగా దీన్ని పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర అసెంబ్లీ నియోజవర్గాల్లో అమలు చేయాలని భావిస్తోంది. ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని అమలు చేసేందుకుగాను.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం కొత్తగా భవనాలను నిర్మించాల్సి ఉండగా.. వీటన్నింటిని ఒకే విధంగా ఉండేలా డిజైన్‌ చేయాలని.. రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆ ప్రకారమే అధికారులు కొన్ని డిజైన్లు సిద్ధం చేయగా.. వాటిని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి తదితరులు పరిశీలించారు.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కార్యక్రమాన్ని ముందుగా కొడంగల్‌, మధిరలో ప్రారంభించి.. ఆ తర్వాత దశలవారీగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలు చేయాలని సర్కార్ యోచిస్తోంది. ఇక కొడంగల్‌, మధిరలో ఈ ప్రాజెక్ట్‌ అమలు కోసం స్కూల్‌ భవనాలు నిర్మించడం కోసం గాను రెండు నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఇప్పటికే.. 20 ఎకరాల చొప్పున స్థలాన్ని కూడా సేకరించటం గమనార్హం. ఆర్కిటెక్టుల నుంచి వచ్చిన డిజైన్లలో ఉత్తమంగా ఉన్న వాటిని ఎంపిక చేసి ఈ 2 నియోజకవర్గాల్లో భవనాలు నిర్మించి.. ఆచరణాత్మక సమస్యలపై అధ్యాయనం చేసిన తర్వాత.. మిగిలిన నియోజకవర్గాల్లో దీన్ని అమలు చేయాలని.. రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ కార్యక్రమం విజయవంతం సాధిస్తే.. ఆ తర్వత అన్ని నియోజకవర్గాల్లో భవనాలు నిర్మించాలని భావిస్తోంది.