iDreamPost
android-app
ios-app

Revanth Reddy: కల్లు గీత కార్మికులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త.. కీలక ప్రకటన

  • Published Jul 14, 2024 | 5:13 PM Updated Updated Jul 14, 2024 | 5:13 PM

Revanth Reddy-Katamaiah Kits: తెలంగాణ సర్కార్‌ కల్లుగీత కార్మికులకు శుభవార్త చెప్పింది. వారి కోసం కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

Revanth Reddy-Katamaiah Kits: తెలంగాణ సర్కార్‌ కల్లుగీత కార్మికులకు శుభవార్త చెప్పింది. వారి కోసం కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

  • Published Jul 14, 2024 | 5:13 PMUpdated Jul 14, 2024 | 5:13 PM
Revanth Reddy: కల్లు గీత కార్మికులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త.. కీలక ప్రకటన

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్‌ సర్కార్‌ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చడమే కాక.. ప్రజా సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల వారు అభివృద్ధి చెందడమే తమ ప్రభుత్వం ధ్యేయమని స్పష్టం చేస్తున్నారు. ఇక ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని.. అలానే రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని.. త్వరలోనే దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్‌ సర్కార్‌ కల్లు గీత కార్మికులకు శుభవార్త చెప్పారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

తాజాగా రేవంత్‌ సర్కార్‌.. రాష్ట్రంలోని గీత కార్మికులకు శుభవార్త చెప్పింది. వారి సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. తాటి, ఈత చెట్లను ఎక్కి కల్లు గీసే కార్మికులకు రక్షణ కల్పించడం కోసం.. సేఫ్టీ కిట్లను పంపిణీ చేసే కాటమయ్య రక్ష పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ప్రారంభించారు. కల్లు గీసే గౌడ సోదరుల కోసం ప్రభుత్వం ఈ సురక్షిత కిట్ల పంపిణీ పథకాన్ని అమలు చేయనుంది. ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని అబ్దుల్లాపూర్ మెట్ మండలం, లష్కర్ గూడ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గౌడన్నలకు కాటమయ్య రక్ష కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

చెట్టు ఎక్కి కల్లు గీసే సమయంలో కొన్ని సందర్భాల్లో.. జారి పడి గీత కార్మికులు చనిపోతున్నారు. ఈ ప్రమాదాలు జరగకుండా చూసుకునేందుకు.. వారికి అత్యంత సేఫ్టీ ఇచ్చే కిట్లను హైదరాబాద్ ఐఐటీతో కలిసి ఓ ప్రైవేటు సంస్థ తయారు చేసింది. గీత కార్మికులు సులువుగా, సురక్షితంగా తాటి, ఈత చెట్లను ఎక్కేలా వీటిని రూపొందించారు. ప్రమాదవశాత్తు తాటి చెట్ల మీద నుంచి కింద పడకుండా ఈ కిట్లలో ప్రత్యేక టెక్నాలజీ ఉంది. ఒక్కో కిట్‌లో 6 పరికరాలు ఉంటాయి. తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్ వంటివన్నీ వేర్వేరుగా ఉంటాయి. పైగా ఇవి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీద వీటిని పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రమంతటా ఎక్సైజ్, బీసీ సంక్షేమ శాఖలు పంపిణీ చేస్తాయి అని తెలుస్తోంది

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని.. గ్రామ గ్రామానా ఉన్న గౌడన్నలు.. కోరుకున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికీ మేలు జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని వారు బలంగా కోరుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో గౌడన్నల పాత్ర మర్చిపోలేనిది. అందుకే రాష్ట్ర పదవుల్లోనూ గౌడ వర్గం వారికి ప్రాధాన్యం ఇచ్చాము. కులవృత్తులు, చేతి వృత్తుల పట్ల ప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి ఉంది. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన తెలంగాణ బాలిక మలావత్ పూర్ణ సూచనతో ప్రభుత్వం ఈ కిట్ల పంపిణీ చేపట్టింది. ఎవరెస్ట్ ఎక్కిన బాలిక అనుభవంతో.. ఈ కిట్ల తయారీ జరిగింది’’ అని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఈ కిట్ల వల్ల భవిష్యత్తులో ఏ గౌడన్నా చనిపోయే పరిస్థితి ఉండదు అని రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు.