iDreamPost
android-app
ios-app

స్విగ్గీ డెలివరీ బాయ్ ఫ్యామిలీకి CM రేవంత్ ఆర్థిక సాయం!

Revanth Reddy: తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తనదైన నిర్ణయాలతో ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు. తాజాగా స్విగ్గీ డెలివరీగా పని చేస్తూ చనిపోయిన యువకుడి కుటుంబ పట్ల సీఎం మంచి మనస్సు చాటుకున్నారు.

Revanth Reddy: తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తనదైన నిర్ణయాలతో ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు. తాజాగా స్విగ్గీ డెలివరీగా పని చేస్తూ చనిపోయిన యువకుడి కుటుంబ పట్ల సీఎం మంచి మనస్సు చాటుకున్నారు.

స్విగ్గీ డెలివరీ బాయ్ ఫ్యామిలీకి CM రేవంత్ ఆర్థిక సాయం!

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సీఎంగా పదవి చేపట్టిన దగ్గర నుంచి నేటి వరకు తీసుకునే ప్రతి నిర్ణయం సంచలనమే. తనదైన నిర్ణయాలతో ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు సీఎం రేవంత్ రెడ్డి. తమది గడీల పాలన కాదు.. ప్రజాప్రభుత్వం అంటూ సీఎం తెలిపారు. అంతేకాక ఏ సమస్య ఉన్న పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉటుందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తాజాగా ఓ కుటుంబం విషయంలో సీఎం మానవత్వం చాటుకున్నారు. స్విగ్గీ డెలివరీ యువకుడి కుటుంబానికి సీఎం ఆర్థిక సాయం చేశారు.

కొన్ని నెలల క్రితం స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. పుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడిపోయి  ఆ యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పట్లో స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి ఘటన  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అంతేకాక ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడ బయటకు రావడంతో అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ  ఘటన మరోసారి వార్తల్లో నిలిచింది.

డిసెంబర్ 23న గిగ్ వర్కర్లతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో విధి నిర్వహణలో మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ ఆకుటుంబానికి ఏదైనా సాయం చేస్తుందని తాను చూశానని, కానీ కేసీఆర్ సర్కార్ నుంచి ఎలాంటి స్పందన లేదని రేవంత్ చెప్పారు. అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని  సీఎం అప్పట్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకుని మరీ.. తాజాగా నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. శనివారం  స్విగ్గీ డెలివరీ యువకుడి కుటుంబానికి సీఎం రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు.

ఇచ్చిన మాట ప్రకారం.. కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించి.. సీఎం ప్రశంసలు అందుకుంటున్నారు. సీఎం రిలీఫ్ పండ్ నుంచి రూ.2 లక్షల చెక్ ను శనివారం సచివాలయంలో మృతుడి కుటుంబానికి అందించారు. ఇక ఆ యువకుడి కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ కి కృతజ్ఞతలు తెలిపారు. నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీ విషయంలో రేవంత్ రెడ్డి కూడా ఇలానే మానవత్వం చాటుకున్నారు.  ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఉద్యోగం కల్పిస్తానని మాట ఇచ్చారు. ఆ విధంగానే అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆమెకు ఉద్యోగం కల్పించి.. అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. మరి.. ఇలా మానవత్వం చాటుకుంటున్న రేవంత్ రెడ్డిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.