Dharani
CM Revanth Reddy-New Tagline To TG: అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కొత్త ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఆ వివరాలు..
CM Revanth Reddy-New Tagline To TG: అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కొత్త ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఈ పర్యటన ప్రారంభించారు. అమెరికా టూర్ కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా వెళ్లారు. ఇప్పటికే అనేక కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఇదిలా ఉండగా అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు సరికొత్త పేరు పెట్టారు. ఇకపై అందరూ అలానే పిలవాలని పిలుపునిచ్చారు. ఇంతకు సీఎం రేవంత్ పెట్టిన కొత్త పేరు ఏంటంటే..
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. తాజాగా కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్‌టేబుల్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ టెక్ యునికార్న్స్ సీఈవోలను ఉద్దేశించి మాట్లాడారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం ‘ది ఫ్యూచర్ స్టేట్’కు పర్యాయపదంగా నిలుస్తుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. అందుకే ఇకపై రాష్ట్రాన్ని తెలంగాణ ప్యూచర్ స్టేట్ అని పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
అంతేకాక ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఈ సందర్భంగా ఆహ్వానించారు సీఎం రేవంత్. మీ భవిష్యత్తును ఆవిష్కరించుకొండి. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం అని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. అంతేకాక అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం.. దాన్ని సూచించే నినాదం ఉంది అన్నారు. అయితే ఇండియాలోని రాష్టాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవని తెలిపారు. అంతేకాక ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్‌గా పెట్టుకుందామన్న సీఎం రేవంత్.. ఇకపై మన రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్.. అని పిలుద్దాం అని చెప్పుకొచ్చారు.