Revanth Reddy: AP మహిళకు తెలంగాణలో ఉద్యోగం.. రేవంత్ రెడ్డి మంచి మనసుపై ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ మహిళకు తెలంగాణలో ఉద్యోగం కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. ఎందుకంటే..

ఆంధ్రప్రదేశ్ మహిళకు తెలంగాణలో ఉద్యోగం కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. ఎందుకంటే..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సీఎం పదవి చేపట్టిన మొదటి రోజు నుంచే.. పాలనలో తనదైన మార్క్ చూపించే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వికలాంగురాలు రజినీకి ఉద్యోగం ఇచ్చి.. మాట నిలబెట్టుకున్నారు. సీఎం అయినప్పటికి తన చర్యలు, తీసుకునే నిర్ణయాల ద్వారా తాను ప్రజల మనిషిని అని.. అన్నా అని పిలిస్తే చాలు పలుకుతానని చెప్పకనే చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళకు ఉద్యోగం ఇచ్చారు రేవంత్ రెడ్డి. దాంతో ఆయన మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలేం జరిగింది అంటే..

ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుందనే.. కొట్లాడి మరి ఏపీ నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయింది. రాష్ట్రంలోని ఉద్యోగాలన్ని తెలంగాణ వాసులకే వర్తిస్తాయి. కానీ తాజాగా ఏపీకి చెందిన మహిళకు ఉద్యోగం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకు అంటే.. సదరు మహిళ భర్త కానిస్టేబుల్ గా పని చేస్తూ.. డ్యూటీలో ఉండగా ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుంచి వారి కుటుంబ పరిస్థితి దీనంగా మారింది. భర్త చనిపోతే భార్యకు ఉద్యోగం ఇస్తారు. కానీ ఇక్కడ కానిస్టేబుల్ భార్యది తెలంగాణ ప్రాంతం కాదు. దాంతో ఆమెకు ఉద్యోగం ఇవ్వలేదు గత ప్రభుత్వం.

తాజాగా ప్రజావాణి ద్వారా ఆ కుటుంబ దీని స్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో నిబంధనలు సడలించి ఆమెకు ఉద్యోగాన్ని కల్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సదరు మహిళకు జూనియర్ అసిస్టెంట్‌ ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన సాయాన్ని జన్మలో మరువలేమంటున్నారు ఆ కుటుంబ సభ్యలు. వివారాల్లోకి వెళ్తే. సొంగా శేఖర్ అనే వ్యక్తి రాచకొండ పోలీసు కమిషనరేట్, అంబర్ పేట పోలీసు హెడ్ హెడ్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తుండేవాడు.

ఈ క్రమంలో మూడేళ్ల క్రితం అనగా.. 2021 సెప్టెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అయితే చనిపోయిన కానిస్టేబుల్ శేఖర్ భార్య సత్యలతది ఆంధ్ర ప్రదేశ్ కావడంతో.. స్థానికత నిబంధనలు కారణంగా ఆమెకు ఉద్యోగం లభించలేదు. రెండేళ్లుగా ఆ కుటుంబం ప్రభుత్వానికి విన్నవించుకున్న ఫలితం లేకపోయింది. దీంతో బాధితులు తాజాగా ప్రభుత్వ ప్రజావాణి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ కుటుంబ దీనస్థితిని వివరించారు. వారి సమస్య తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. మానవతా దృక్పథంతో నిబంధనలు సడలించి.. సత్యలతకు ఉద్యోగం ఇవ్వాలని రాష్ర్ట డీజీపీ, రాచకొండ సీ‌పీలకు ఆదేశాలు జారీ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సత్యలతకు రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కల్పిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఉద్యోగానికి సంబంధించి ఆమెకు నియామక ప్రతాలను అందజేశారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ శేఖర్ కుటుంబసభ్యులు.. ముఖ్యమంత్రి రేవంత్‌తో పాటు డీజీపీ, రాచకొండ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు.

Show comments