iDreamPost
android-app
ios-app

CM రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వారందరికీ రైతు బంధు కట్‌!

  • Published Mar 06, 2024 | 10:18 AM Updated Updated Mar 06, 2024 | 10:27 AM

రైతు బంధుకు సంబంధించిన రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీన్ని బట్టి వారికిక రైతు బంధు కట్‌ చేస్తారని అంటున్నారు. ఆ వివరాలు..

రైతు బంధుకు సంబంధించిన రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీన్ని బట్టి వారికిక రైతు బంధు కట్‌ చేస్తారని అంటున్నారు. ఆ వివరాలు..

  • Published Mar 06, 2024 | 10:18 AMUpdated Mar 06, 2024 | 10:27 AM
CM రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వారందరికీ రైతు బంధు కట్‌!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎలక్షన్‌ సమయంలో ఇచ్చిన ఒక్కొ హామీని అమలు చేస్తూ.. ముందుకు సాగుతు‍ంది. మరీ ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం రేవంత్‌ సర్కార్‌ కట్టుబడి ఉంది. ఇప్పటికే వీటిల్లో నాలుగు పథకాలను ప్రారంభించింది రేవంత​ సర్కార్‌. ఇక మార్చి ఒకటి నుంచి గృహజ్యోతి, గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను మొదలుపెట్టింది. ఇక మరో వారం రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ పథకం కూడా మొదలు పెట్టనుంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. అయితే అందరి దృష్టి మాత్రం రైతు భరోసాపైనే ఉంది. అదే రైతుబంధు పథకం.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన.. రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చి.. మరో ఐదు వేలు పెంచి.. మొత్తం 15 వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తామని ప్రకటించింది. అంతేకాక రైతులతో పాటు కౌలురైతులకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పుకొచ్చింది. అయితే.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతుబంధు పథకంలో చాలా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఈ పథకం కింద.. అర్హులైన రైతులకు మాత్రమే కాకుండా కొండలు, గుట్టలు, రోడ్లకు కూడా రైతుబంధు డబ్బులు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాగా.. అధికారంలోకి వచ్చాక వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తూ.. ఈ పథకం కింద జరిగిన అవినీతిపై ఆరా తీయటమే కాకుండా.. పెట్టుబడి సాయం నిరుపయోగం కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి రేవంత్‌రెడ్డి సర్కార్‌ అధికారులతో చర్యలు జరుపుతోంది.

అంతేకాక రైతుబంధులా కాకుండా రైతుభరోసా పథకానికి భూ పరిమితులు, కట్టుదిట్టమైన నిబంధనలనే పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నిర్ధిష్టమైన విధివిధానాలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే.. భూమిని ప్రామాణికంగా చేసుకుని రైతు భరోసా ఇస్తారా.. లేదా టాక్స్ పేయర్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారా అన్నదానిపై చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా సచివాలయంలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. రైతు భరోసా పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పన్ను చెల్లించేవారికి రైతుబంధు ఎందుకని ఆయన ప్రశ్నించారు. కేవలం భూమిని సాగు చేసే రైతన్నలకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. దీనిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో.. రైతు భరోసా పథకానికి పాన్ కార్డు లింక్ చేస్తామని.. ఇక టాక్స్ పేయర్లందరికీ రైతు భరోసా కట్ అవుతుందంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.