iDreamPost
android-app
ios-app

రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. అన్నిపార్టీల నేతలతో..

  • Published May 30, 2024 | 12:19 PM Updated Updated May 30, 2024 | 12:19 PM

CM Revanth Reddy Key Decision: తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

CM Revanth Reddy Key Decision: తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

  • Published May 30, 2024 | 12:19 PMUpdated May 30, 2024 | 12:19 PM
రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. అన్నిపార్టీల నేతలతో..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం గా రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు కృషి చేస్తున్నారు.. ఇప్పటికే కొన్ని ప్రారంభించారు. రైతుల సంక్షేమ పథకాల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం రూపు, గీతం రూపకల్పన విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండింటి విషయంలో మార్పులు చేస్తున్నారు.. ఇది తుది దశకు చేరుకుంది. తెలంగాణ అవతర దినోత్సవం సందర్భంగా ఈ రెండింటిని విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై ప్రభుత్వం నేడు (మే 30) అన్ని పార్టీల నేతలలో కీలక భేటి కానుంది. సాయంత్రం 4 గంటలకు సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీల నేతలు సచివాలయం లో సీఎం రేవంత్ తో సమావేశం అవుతారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం, గీతం పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై రాజకీయ పార్టీలకు రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర చిహ్నంలో రాచరికపు గుర్తులను తొలంగించాలని ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దాని స్థానంలో ప్రజా స్వామ్యం, తెలంగాణ అమరవీరుల త్యాగఫలం ప్రతిబింభించేలా రాష్ట్ర కొత్త చిహ్నం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు 12 నమూనాలను రుద్ర రాజేశం తయారు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పార్టీ నేతలతో, కొందరు అధికారులతో సీఎం చర్చించారు. తుది రూపంపై బుధవారం కూడా సీఎం సమీక్షించారు.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండింటిని ఆవిష్కరించాలని కాంగ్రెస్ సర్కార్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఈ సమావేశానికి ఆయా పార్టీల ముఖ్య నేతలు హాజరవుతారా? మొదటి నుంచి రాష్ట్ర చిహ్నం, గీతం మార్పుపై వ్యతిరేత చాటుకుంటున్న బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందనేది సస్పెన్స్ గా మారింది.