iDreamPost
android-app
ios-app

Revanth Reddy: నిరుద్యోగులకు అలర్ట్‌.. డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల తేదీలపై CM రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన

  • Published Jul 06, 2024 | 9:51 AM Updated Updated Jul 06, 2024 | 9:51 AM

Unemployees Protest: తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళన తీవ్రతరం చేశారు. శుక్రవారం నాడు టీజీపీఎస్‌సీ భవన్‌ ముట్టడికి యత్నించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

Unemployees Protest: తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళన తీవ్రతరం చేశారు. శుక్రవారం నాడు టీజీపీఎస్‌సీ భవన్‌ ముట్టడికి యత్నించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  • Published Jul 06, 2024 | 9:51 AMUpdated Jul 06, 2024 | 9:51 AM
Revanth Reddy: నిరుద్యోగులకు అలర్ట్‌.. డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల తేదీలపై CM రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యమైన కారణాల్లో నిరుద్యోగులు కూడా ఒక రీజన్‌ అని చెప్పవచ్చు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో నిరుద్యోగుల అంశంలో చోటు చేసుకున్న అనేక తప్పిదాల కారణంగా వారిలో అసంతృప్తి మిగిల్చింది. దాని ఫలితం ఎన్నికల రిజల్ట్‌లో కనిపించింది. ఇక ఎలక్షన్‌ సమయంలో నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ అనేక హామీలను ఇచ్చింది. తాము అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. అధికారంలోకి రాగానే టీఎస్‌పీఎస్సీ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేసి.. కొత్త దాన్ని ఏర్పాటు చేసింది. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ నిర్వహించింది. జాబ్‌ క్యాలెండర్‌ వంటి అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి.

అయితే ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ కటాఫ్‌, గ్రూప్‌ 2,3 పోస్టుల పెంపు, మెగా డీఎస్సీ నిర్వహణపై పట్టుబడుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. కానీ సానుకూల స్పందన రాకపోవడంతో.. ఆందోళనలకు దిగుతున్నారు. ఇక శుక్రవారం నాటికి ఈ ఆందోళన తీవ్ర రూపం దాల్చి.. ‘నిరుద్యోగ ర్యాలీ’ పేరుతో హైదరాబాద్‌లోని టీజీఎస్‌పీఎస్‌సీ భవన్‌ ముట్టడికి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. దాంతో ఒక్కసారిగా పరిస్థితి హీటెక్కింది. వేల సంఖ్యలో నిరుద్యోగులు రోడ్డెక్కారు. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు.. టీజీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని చేరుకుని.. నిరసన వ్యక్తం చేశారు.

ఇక నిరుద్యోగులకు బీజేవైఎం, ఆమ్ ఆద్మీ పార్టీల నేతలు కూడా మద్దతు తెలిపారు. ముట్టడి నేపథ్యంలో.. టీజీఎస్పీఎస్సీ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించగా.. నిరసనకారులను ఎక్కడికక్కడా అరెస్ట్ చేశారు. దీంతో.. ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసుల తీరు, నిరుద్యోగుల పట్ల సర్కార్‌ తీరుపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన నేతలు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగాల నోటిఫికేషన్లు, గ్రూప్స్‌ పరీక్షల నిర్వహణ అంశాలపై రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా.. ఉద్యోగాల నోటిఫికేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి.. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. కొన్ని రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తులు కుట్రలు చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు. అంతేకాక రాజకీయ పార్టీలు చేస్తున్న స్వర్థపూరిత కుట్రలకు బలికావొద్దని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల తేదీలపై టీజీఎస్పీఎస్సీ, విద్యాశాఖతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అప్పటి వరకు కొంత ఓపిక పట్టాలని.. విపక్ష పార్టీల ఉచ్చులో పడొద్దని నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మరి ఈ సమస్య పరిష్కారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని నిరుద్యోగులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.