iDreamPost
android-app
ios-app

CM రేవంత్ స్వగ్రామం మహిళకు ఐదెకరాల భూమి, గవర్నమెంట్ జాబ్… ఎందుకంటే

  • Published Apr 04, 2024 | 12:19 PM Updated Updated Apr 04, 2024 | 12:19 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామానికి చెందిన ఓ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇచ్చారు. ఎందుకంటే..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామానికి చెందిన ఓ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇచ్చారు. ఎందుకంటే..

  • Published Apr 04, 2024 | 12:19 PMUpdated Apr 04, 2024 | 12:19 PM
CM రేవంత్ స్వగ్రామం మహిళకు ఐదెకరాల భూమి, గవర్నమెంట్ జాబ్… ఎందుకంటే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలానే గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. దీంతో పాటు ఎన్నికల ప్రచారంలో కొందరికి ఇచ్చిన మాటను సైతం నిలబెట్టుకుంటున్నారు. దీనిలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రజినీకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. ఇక తాజాగా తన స్వగ్రామానికి చెందిన ఓ మహిళకు ఐదైకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే..

సీఎం రేవంత్ రెడ్డి గొప్పమనసు చాటుకున్నారు. ఎప్పుడో పదేళ్లకింద తన స్వగ్రామం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ ఒకరు దేశ రక్షణకోసం తన ప్రాణాలు విడిచిన విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. జవాన్ కుటుంబాన్ని రేవంత్ ఆదుకున్నారు. దాంతో ఆ కుటుంబం సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపింది.

రేవంత్ రెడ్డి స్వగ్రామం.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని కొండారెడ్డిపల్లె. ఇక్కడి ప్రజలతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడి వారికి ఏ కష్టం వచ్చినా సరే ఆయన ముందుకు వచ్చి ఆదుకుంటారు. అలానే దేశ రక్షణ విధుల్లో వీరమరణం పొందిన ఓ ఆర్మీ జవాన్ కుటుంబానికి అండగా నిలిచారు రేవంత్ రెడ్డి. సదరు జవాన్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు.. ఆ కుటుంబానికి ఐదెకరాల భూమి ఇచ్చి.. మంచి మనసు చాటుకున్నారు.

అసలేం జరిగిందంటే..

వంగూరు మండలం కొండారెడ్డిపల్లె గ్రామానికి చెందిన మల్లెపాకుల యాదయ్య ఇండియన్ ఆర్మీలో పనిచేసేవాడు. 2013లో జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ వద్ద.. ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో యాదయ్య ప్రాణాలు కోల్పోయాడు. యాదయ్య కుటుంబానికి గత ప్రభుత్వం సాయం చేసింది. అతడి భార్య సుమతమ్మకు రూ.5 లక్షల రూపాయలు, కల్వకుర్తిలో 165 గజాల ఇంటి స్థలాన్ని అందించింది. కొంత పెన్షన్ డబ్బులు కూడా వస్తుండటంతో కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తోంది సుమతమ్మ.

జవాన్ యాదయ్య కుటుంబానికి మరింత సాయం చేయాలని ఆనాడే రేవంత్ ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ నాటి సర్కార్ ఆయన అభ్యర్థనను పట్టించుకోలేదు. దాంతో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యాదయ్య కుటుంబానికి మరింత సాయం చేయడానికి ముందుకు వచ్చారు రేవంత్ రెడ్డి. యాదయ్య భార్య సుమతికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఆదుకున్న రేవంత్..

దీంతో వెంటనే నాగర్ కర్నూల్ కలెక్టర్ సుమతమ్మకు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇస్తూ నియామక ప్రతం అందించారు. చారగొండ తహసీల్దార్ కార్యాలయంలో పోస్టింంగ్ ఇచ్చారు. అంతేకాదు సీఎం ఆదేశాలతో ఆమెకు ఐదు ఎకరాల భూమిని కూడా కేటాయించారు. ఈ క్రమంలో సుమత్తమ్మ, ఆమె బిడ్డలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఆయన చేసిన సాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేము అన్నారు. రేవంత్ చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు.