P Krishna
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన మరోసారి ఓ కీలక ప్రకటన చేశారు.
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన మరోసారి ఓ కీలక ప్రకటన చేశారు.
P Krishna
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ల పాటు పాలన కొనసాగించిన బీఆర్ఎస్ కి చెక్ పెడుతూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే తొలి సంతకం ఆరు గ్యారెంటీ హామీ పథకాలపై చేశారు. ఎన్నికల ముందు తెలంగాణలో ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజల్లోకి వెళ్లింది కాంగ్రెస్ పార్టీ. ఆరు గ్యారెంటీ పథకాలకు ఆకర్షితులై తెలంగాణ ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇదిలా ఉంటే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ముమ్మరంగా ప్రచారాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే..
ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ లో రాహూల్ గాంధీతో కలిసి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తీవ్రమైన ఎండలు సైతం లెక్కచేయకుండా ప్రచారానికి తరలివచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీరు మాపై నమ్మకంతో ఆశీర్వదించి అధికారాన్ని కట్టబెట్టారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా. ఏ ఒక్క గ్యారెంటీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రతిఒక్కటీ అమలు చేస్తాం. ప్రతి పక్ష నేతలు హామీలు అమలు చేయలేమని అంటున్నారు.. ఒక్కసారి ఆర్టీసీ బస్సు ఎక్కి చూస్తే తెలుస్తుంది. హామీలు ఎంత వరకు అమలు అవుతున్నాయో అన్న విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమీ చేయలేదు.. విభన హామీ, ఇతర అభివృద్ది పపులు చేయాలని కోరితే.. గాడిద గుడ్డు చేతిలో పెట్టినట్టే. తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువస్తున్నాం. ఇక ఆదిలా బాద్ అంటే నాకు మొదటి నుంచి ఎంతో అభిమానం. దత్తత తీసుకొని అభివృద్ది చేసే బాధ్యత నాదే.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో ఇప్పటికే కొన్ని మలు చేశాం. మే 9వ తేదీ లోపు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తాం’అని అన్నారు. ఆగస్టు 15 వ తేదీ నాటికి ఒకే విడతలో రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేసి తీరుతాం ని ప్రకటించారు.