iDreamPost
android-app
ios-app

CM రిలీఫ్‌ ఫండ్‌ కోసం ఎదురు చూస్తున్నారా.. ఇలా అప్లై చేసుకొండి

  • Published Nov 06, 2023 | 12:52 PM Updated Updated Nov 06, 2023 | 12:52 PM

నేటి కాలంలో మెరుగైన వైద్యం పొందాలంటే.. భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. మరి పేదలు, సామాన్యులు పరిస్థితి ఏంటి అంటే.. అలాంటి వారికి ఆశా దీపం.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌. అయితే దీనికి అర్హతలు ఏంటి.. ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలు చాలా మందికి తెలియదు. అలాంటి వారి కోసం ఇక్కడ పూర్తి వివరాలు..

నేటి కాలంలో మెరుగైన వైద్యం పొందాలంటే.. భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. మరి పేదలు, సామాన్యులు పరిస్థితి ఏంటి అంటే.. అలాంటి వారికి ఆశా దీపం.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌. అయితే దీనికి అర్హతలు ఏంటి.. ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలు చాలా మందికి తెలియదు. అలాంటి వారి కోసం ఇక్కడ పూర్తి వివరాలు..

  • Published Nov 06, 2023 | 12:52 PMUpdated Nov 06, 2023 | 12:52 PM
CM రిలీఫ్‌ ఫండ్‌ కోసం ఎదురు చూస్తున్నారా.. ఇలా అప్లై చేసుకొండి

ప్రస్తుత కాలంలో విద్య, వైద్యం రెండు ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలుగా మారాయి. చదువు అన్నా ఎక్కడో ఒక చోట అడ్జెస్ట్‌ కావచ్చు కానీ.. వైద్యం విషయంలో అలా నిర్లక్ష్యం చేయలేం. ఏమాత్రం అశ్రద్ధ చేసినా నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకే ఎంత పేదవారైనా సరే.. అప్పు చేసి.. ఉన్న కాడికి అమ్మి మరి మెరుగైన చికిత్స పొందే ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి, ఊహించని రీతిలో క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు బారిన పడితే.. ఇక ఆ కుంటుంబం అనుభవించే వ్యధ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉన్నకాడికి ఆస్తులు అమ్మి.. చివరకు అప్పుల పాలైనా సరే.. వ్యాధులు మాత్రం తగ్గవు.

ఇక పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించడం కోసం కేంద్ర, రాష్ట్రం ప్రభుత్వాలు ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్య శ్రీ వంటి పథకాలను అమలు చేస్తోన్నప్పటికి.. అవి అన్ని రకాల వ్యాధుల చికిత్సలను కవర్‌ చేయడం లేదు. ఇక ఇలాంటి వ్యాధులకు చికిత్స పొందాలంటే.. భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత మొత్తాన్ని సామాన్యులు, పేదలు భరించలేరు. అలా అని చూస్తూ చూస్తూ.. వదిలేయలేరు. అదిగో అలాంటి వారి కోసం ఉన్నదే సీఎం రిలీఫ్‌ ఫండ్‌.. ముఖ్యమంత్రి సహాయ నిధి.

ప్రాణాంతక వ్యాధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న పేదలను ఆదుకోవడం కోసం రూపొందించినదే సీఎం రిలీఫ్‌ ఫండ్‌. వైద్యం కోసం చేసిన ఖర్చును పరిశీలించి.. ఆ దరఖాస్తుకు అర్హత ఉందని భావిస్తే.. తగిన మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది. అది ఎంతైనా.. బాధితులకు ఊరటే. మరి.. సీఎం రిలీఫ్​ ఫండ్​ పొందడానికి ఎవరు అర్హులు.. ఎలాంటి సమయంలో దీన్ని వాడుకోవాలి.. దరఖాస్తు చేయడం ఎలా వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

ఎవరు అర్హులంటే..

  • సమాజంలోని అట్టడుగు వర్గాలు, తెల్లకార్డుదారులు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు.
  • ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్లు సీఎంఆర్‌ఎఫ్‌ కింద సాయం పొండానికి అర్హులు.
  • ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన కుటుంబాలు కూడా సాయం పొందవచ్చు.
  • బాధితులు తప్పనిసరిగా రాష్ట్రంలో స్థిర నివాసి అయి ఉండాలి.

కావాల్సిన డాక్యుమెంట్స్‌..

  • ఆధార్ కార్డు
  • పాస్‌పోర్ట్ సైజు ఫొటో
  • వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • రేషన్ కార్డు
  • అప్పటి వరకు ఖర్చు చేసిన ఆస్పత్రి బిల్లులకు సంబంధించిన పేపర్లు
  • బ్యాంకు అకౌంట్​ వివరాలు
  • ఫోన్ నంబరు
  • ఈ-మెయిల్ ఐడీ

ఎలా అప్లై చేయాలంటే..

  • ముందుగా సీఎం రిలీఫ్​ ఫండ్​ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. దీనిలో మీకున్న సమస్యకు సాయం పొందే అవకాశం ఉందో, లేదో చెక్‌ చేసుకోవాలి.
  • సాయం పొందే అవకాశం ఉంటే.. పైన చెప్పిన డాక్యుమెంట్లు తీసుకుని మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్లండి.
  • అక్కడ సీఎం రిలీఫ్​ ఫండ్‌కి సంబంధించిన అప్లికేషన్​ ఫామ్​ తీసుకుని.. అందులో అడిగిన అన్ని వివరాలను సరిగ్గా నమోదు చేయాలి.
  • ఇప్పుడు అవసరమైన పత్రాలను అప్లికేషన్​ ఫామ్‌కి జత చేసి.. మీ సేవ ప్రతినిధికి అందజేయాలి.
  • అప్లై చేసిన తర్వాత ఫామ్‌ని భవిష్యత్‌ అవసరాల ఉపయోగం కోసం ప్రింటవుట్ తీసుకోండి.
  • మీ అర్హతను, జబ్బు తీవ్రతను సీఎం రిలీఫ్ ఫండ్ అధికారులు పరిశీలిస్తారు.
  • ఆ తర్వాత అర్హతను బట్టి తగినంత డబ్బును విడుదల చేస్తారు.