P Venkatesh
విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. మైనారిటీ విద్యార్థులకు సీఎం ఓవర్సీస్ పథకం ద్వారా ఏకంగా 20 లక్షల వరకు స్కాలర్ షిప్ అందిస్తోంది.
విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. మైనారిటీ విద్యార్థులకు సీఎం ఓవర్సీస్ పథకం ద్వారా ఏకంగా 20 లక్షల వరకు స్కాలర్ షిప్ అందిస్తోంది.
P Venkatesh
ఇటీవలికాలంలో ఫారిన్ ఎడ్యుకేషన్ కు ఆదరణ పెరుగుతోంది. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. వందలాది మంది విద్యార్థులు ఫారిన్ లో ఉన్నత చదువులు చదివేందుకు వెళ్తున్నారు. అయితే ఉన్నత విద్య ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రయాణ ఖర్చుల దగ్గర్నుంచి కోర్స్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు, ఇతర ఖర్చులన్నీ కలుపుకుని లక్షలాది రూపాయలు అవసరం అవుతుంటాయి. మరి ఇంత డబ్బు ఖర్చుపెట్టి పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లలేని పరిస్థితి. ఇలా ప్రతిభ ఉండి ఉన్నత చదువులు నోచుకోని విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం సాయమందిస్తోంది. పేద మైనార్టీ విద్యార్థులకు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ అందిస్తోంది.
విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే మైనారిటీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. వారికి రూ. 20 లక్షల వరకు స్కాలర్ షిప్ అందిస్తోంది. తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే పేద మైనార్టీ విద్యార్థులు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి టి. దయానంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం అర్హత గల మైనారిటీ విద్యార్థులు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజీలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా దేశాల్లోని విదేశీ విద్యాలయాల్లో తెలంగాణకు చెందిన క్రైస్తవ మైనారిటీ విద్యార్థులు పీజీ, పీహెచ్ డీ కోర్సులు చదివేందుకు అవకాశం ఉంటుంది.
ఉన్నత విద్య కోసం ఓవర్సీస్ గ్రాంట్ పొందాలనుకుంటున్న తెలంగాణ విద్యార్థులు ఆగస్టు 7వ తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైను, పార్శి మతాలకు చెందిన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోవడానికి ఆగస్టు 7వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ స్కాలర్ షిప్ పొందేందుకు కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల కంటే తక్కువ ఉండాలి. కుటుంబంలో ఒక్క విద్యార్థికే ఛాన్స్. కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, జీఆర్ఈ/జీమ్యాట్, ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ స్కోర్ కలిగి ఉండాలి.