iDreamPost
android-app
ios-app

చిలుకూరు బాలాజీ గుడికి పోట్టెత్తిన జనం.. అసలు ఈ ‘గరుడ ప్రసాదం’ మహిమ ఏంటి?

  • Published Apr 19, 2024 | 5:19 PM Updated Updated Apr 19, 2024 | 5:19 PM

చిలుకూరు బాలాజీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కోరిన కోరికలు నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. అయితే ఏప్రిల్ 19న మహిళా భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. ఎందుకూ అంటే గరుడ ప్రసాదం కోసం. అసలు ఈ గరుడ ప్రసాదం రహస్యం ఏంటి? ఏముంది ఇందులో?

చిలుకూరు బాలాజీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కోరిన కోరికలు నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. అయితే ఏప్రిల్ 19న మహిళా భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. ఎందుకూ అంటే గరుడ ప్రసాదం కోసం. అసలు ఈ గరుడ ప్రసాదం రహస్యం ఏంటి? ఏముంది ఇందులో?

చిలుకూరు బాలాజీ గుడికి పోట్టెత్తిన జనం.. అసలు ఈ ‘గరుడ ప్రసాదం’ మహిమ ఏంటి?

హైదరాబాద్ లో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. మోస్ట్ పవర్ ఫుల్ గాడ్ అని చాలా మంది నమ్ముతారు. ఆ గుడికి వెళ్లి మొక్కుకుంటే అనుకున్నవి జరుగుతాయని చాలా మంది వెళ్తారు. వెళ్లిన వాళ్ళు కూడా తమ కోరికలు నెరవేరాయని చెబుతారు. అయితే మిగతా రోజులతో పోలిస్తే ఏప్రిల్ 19న శుక్రవారం నాడు చిలుకూరు బాలాజీ టెంపుల్ కి భారీగా భక్తులు పోటెత్తారు. ఈ కారణంగా ఆ గుడి వైపు వెళ్లే రూట్లలో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. భారీగా భక్తులు వాహనాలతో బాలాజీ టెంపుల్ కి చేరుకోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 10 నుంచి 15 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు ట్రాఫిక్ ఏ రేంజ్ లో ఉందో అని.

మెహిదీపట్నం, అప్పా జంక్షన్, లంగర్ హౌస్, అవుటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై రద్దీ ఏర్పడింది. ఏంటి అంత ప్రత్యేకత అంటే.. శ్రీరామనవమి తర్వాత రెండో రోజు చిలుకూరు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ శుక్రవారం కూడా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రెండో రోజున గరుత్మంతునికి పొంగలి నైవేద్యం సమర్పిస్తారు. దీన్ని గరుడ పిండం లేక గరుడ ప్రసాదం అని పిలుస్తారు. ఈ ప్రసాదం చాలా శక్తివంతమైనదని.. దీన్ని తిన్న వేల మంది మహిళలు గర్భవతులు అయ్యారని చెబుతారు. 2019లో కొన్ని వేల మంది భక్తులు ఈ ప్రసాదాన్ని తీసుకుని ఇప్పుడు పిల్లలతో వచ్చామని చెబుతున్నారు. అంత మహత్యం ఉందని అంటున్నారు.

సంతానం లేని వాళ్ళు ఏప్రిల్ 19న బాలాజీ టెంపుల్ కి వచ్చి ప్రసాదం తీసుకోవాలని ఆలయ పూజారులు ప్రకటన చేశారు. దీంతో ఈ ఏడాది కూడా ప్రసాదం కోసం మహిళలు వేల సంఖ్యలో పోటెత్తారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ముందస్తుగానే ఏర్పాట్లు చేసినప్పటికీ గతంతో పోలిస్తే ఊహించిన దాని కంటే ఎక్కువ మంది భక్తులు ఈసారి వచ్చారు. దీంతో అటు పోలీసులు ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే గరుడ ప్రసాదాన్ని తింటే నిజంగా ఫలితం వస్తుందా? తినకపోతే ఫలితం ఉండదా? అంటే అది భక్తులు నమ్మే నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎవరినీ తప్పుబట్టడానికి వీల్లేదు.

స్వామి వారి ఉత్సవాలు జరుగుతున్నాయి. మంచి రోజు.. ప్రసాదం తింటే మంచిది అని నమ్మి వెళ్లిన భక్తులని తప్పుబట్టలేం. అలా అని జనాన్ని ఇబ్బందిపడిన తీరుకి భక్తులను తప్పుబట్టకుండా ఉండలేం. ఒక్కరోజే కదా ఏమవుతుంది అనుకుంటే ఏమీ కాదు. నమ్మిన భక్తులకు మంచి జరిగితే చాలు కదా. ఇదే గరుడ ప్రసాదం రహస్యం. నమ్మితే సంతానం కలుగుతుంది. నమ్మకపోయినా వేరే వేరే మార్గాల్లో సంతానం కలుగుతుంది. ఇక్కడ దేవుడ్ని నమ్మినవారికి, నమ్మనివారికి ఇద్దరికీ పనులవుతున్నాయి. అయితే ఎవరి ఆత్మసంతృప్తి వారిది. మరి ఈ విషయంలో మీరేమంటారు?