iDreamPost
android-app
ios-app

నాన్‌ వెజ్‌ ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన చికెన్‌ ధర!

నాన్‌ వెజ్‌ ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన చికెన్‌ ధర!

ప్రపంచం మొత్తం మీద వెజిటీరియన్స్‌ కంటే నాన్‌ వెజిటీరియన్సే ఎక్కువగా ఉంటారన్నది నిర్వివాదాంశం. నాన్‌వెజ్‌ అంటే పడిచచ్చేవారు లేకపోలేదు. కొంతమందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. అయితే, మటన్‌, చికెన్‌ రేట్లను బట్టి కొంతమంది నోరు కట్టుకుంటూ ఉంటారు. వాటి ధరలు తగ్గినపుడు రెచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు నాన్‌ వెజ్‌ ప్రియులకు ఓ శుభవార్త అందింది. హైదరాబాద్‌ నగరంలో చికెన్‌ రేట్లు భారీగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు 160 పైనే ధర ఉండేది. దీంతో చికెన్‌ కొనడానికి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చికెన్‌ రేట్లు భారీగా తగ్గాయి. కిలో చికెన్‌ కేవలం 125 రూపాయలు మాత్రమే పలుకుతోంది. వర్షాల కారణంగా నగరంలో చికెన్‌ ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. శ్రావణ మాసం మొదలైతే చికెన్‌ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు! మరికొన్ని నెలల్లో చికెన్‌ ధరలు 90కి కూడా చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు టమాటా ధరతో సమానంగా చికెన్‌ ధర ఉంటోంది. దీంతో నాన్‌ వెజ్‌ ప్రియులు టమాటాకంటే ఎక్కువగా చికెన్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇక, బోన్‌ లెస్‌ చికెన్‌ రేట్లు కూడా భారీగా తగ్గాయి. నిన్న, మొన్నటి వరకు 280- 320 రూపాయల వరకు ఉండేది. అయితే, ఇప్పుడు ధర తగ్గి.. 200 రూపాయలకే కిలో లభిస్తోంది. ఒక వేళ రీటైల్‌ షాపుల్లో ఎక్కువ మొత్తం గనుక తీసుకుంటే ఈ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది. కాగా, వర్షాకాలంలో..అదీ అధిక టమాటా ధరలతో అల్లాడుతున్న నాన్‌ వెజ్‌ ప్రియులకు ఇదో శుభపరిణామం. మరి, భారీగా తగ్గిన చికెన్‌ ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.