iDreamPost
android-app
ios-app

HYDలో భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కిలో ఎంతంటే?

  • Published Sep 10, 2024 | 9:39 AM Updated Updated Sep 10, 2024 | 10:34 AM

Hyderabad: గతవారం క్రితం నగరంల కిలో చికెన్ రూ.200లకు పైగానే విక్రయించిన విషయం తెలిసిందే. దీంతో మాంసం ప్రియులు చాలా ఇబ్బంది పడ్డారు. పైగా ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నాన్ వెజ్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త అందింది.

Hyderabad: గతవారం క్రితం నగరంల కిలో చికెన్ రూ.200లకు పైగానే విక్రయించిన విషయం తెలిసిందే. దీంతో మాంసం ప్రియులు చాలా ఇబ్బంది పడ్డారు. పైగా ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నాన్ వెజ్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త అందింది.

  • Published Sep 10, 2024 | 9:39 AMUpdated Sep 10, 2024 | 10:34 AM
HYDలో భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కిలో ఎంతంటే?

ఈ రోజుల్లో ముక్క లేనిదో ఎవరికి ముద్ద కూడా దిగదు. అందుకే సండే అయినా మండే అయినా నాన్ వెజ్ మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే. ముఖ్యంగా ధర ఎంతైనా పర్వాలేదు కానీ, చికెన్ తినడంలో మాత్రం రాజీపడాల్సిన అవసరమే లేదంటారు నాన్ వెజ్ ప్రియులు. అంతేనా కూరలో కారం తక్కువైనా పర్వాలేదు కానీ, ఫంక్షన్లు, దగ్గర నుంచి పండుగలు, పార్టీ వరకు నాన్ మాత్రం ముఖ్యం అంటుంటారు. ఇక అందుకు తక్కట్టుగానే మహానగరంలో చికెన్ డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. దీంతో ధరలు కూడా గత కొన్ని రోజులు వరకు భారీగా కొండెక్కి కూర్చున్నాయి. ముఖ్యంగా గత వారంలోలో కిల్ చికెన్ ధర రూ.200 పైగా విక్రయించారు. దీంతో మాంసం ప్రియులు చాలా ఇబ్బంది పడ్డారు. పైగా ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నాన్ వెజ్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త అందింది. నేడు తెలంగాణలో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ప్రస్తుతం కిలో చికెన్ ధర ఎంత ఉందంటే?

గతవారం క్రితం నగరంల కిలో చికెన్ రూ.200లకు పైగానే విక్రయించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం గణేశ్ నవరాత్రులు మొదలుకావడంతో ఒక్కసారిగా నగరంలో మాంసం విక్రయాలు క్రమేపి తగ్గిపోయాని తాజాగా వ్యాపారులు చెబుతున్నారు. దీంతో చికెన్ ధరలు కూడా అమాంతం పడిపోయింది. కాగా, నేడు మంగళవారం చికెన్ ధరలు చూసుకున్నట్లయితే.. స్కిన్ లెస్ చికెన్ కిలో ధర మార్కెట్ లో రూ. 183 వద్ద ఉంది. అదే విత్ స్కిన్ చికెన్ ధర రూ.161 వద్ద కొనసాగుతుంది. అయితే ఫామ్ రేటు రూ.89 వద్ద ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే రిటైల్ ధర రూ.111 వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం నగరంలో చవతి పర్వదినం ఉన్న నేపథ్యంలో.. మరో 10 రోజులపాటు  చికెన్ విక్రయాలు నగరంలో ఎక్కువగా జరగకపోవచ్చని వ్యాపారస్తులు పేర్కొన్నారు.

అయితే మళ్లీ దసరా సీజన్ ప్రారంభమైతే చికెన్ ధరలు రూజ200 కు పైగా పెరగవచ్చని అధికారులు, చికెన్ షాప్ ఓనర్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ లో చికెన్ ధరలు భారీగాా తగ్గుముఖం పట్టడంతో.. నాన్ వెజ్ ప్రియులకు ఇదే సరైన సమయం. ఈ సమయంలో ఫంక్షన్లు, పార్టీలు చేసుకున్నవారికి బాగా కలిసివస్తుందని చెప్పవచ్చు. మరీ, నగరంలో భారీగా చికెన్ ధరలు పడిపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.