P Krishna
ఈ మద్య దేశంలో తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మాన తప్పిదాలు, సాంకేతిక లోపాల వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
ఈ మద్య దేశంలో తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మాన తప్పిదాలు, సాంకేతిక లోపాల వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
P Krishna
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. 2023 లో ఫిబ్రవరిలో జరిగిన ఒడిశా రైలు ప్రమాద ఘటన మిగిల్చిన విషాదం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఆ తర్వాత పలు చోట్ల రైలు ప్రమాదాలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ కి పెద్ద ప్రమాదం తప్పింది. హఠాత్తుగా పట్టాలు తప్పిన ట్రైన్ ఫ్లాట్ ఫామ్ సైడ్ వాల్ ని ఢీ కొట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మూడు బోగీలు పక్కకు ఒరిగిపోవడంతో 50 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. భయంతో కొంతమంది ప్రయాణిలకులు అక్కడ నుంచి పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే..
చెన్నై నుంచి హైాదరాబాద్ కి వస్తున్న చార్మినార్ ఎక్స్ ప్రెస్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఆగడానికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అప్పటికే రైలు చాలా నెమ్మెదిగా ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంతో కొంతమంది భయంతో గుండెపోటు వచ్చినట్లు తోటి ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడ్డవారిని లాలాగూడ లోని రైల్వే ఆస్పత్రికి తరలించారు. రైలులోని ఎస్ 2, ఎస్ 3, ఎస్ 6 బోగాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. రైలు ప్రమాదంలో ఎవరికీ ప్రాణా హాని జరగలేదని..క్షత గాత్రులను రైల్వే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామన్నారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.