రాహుల్ బస్సుయాత్ర షెడ్యూల్‌లో మార్పు.. ఢిల్లీలో ఏం జరుగుతుంది?

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో పార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంది. తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రచారం చేసి ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేయాలి. ఇదే లక్ష్యంతో అధికార పార్టీ బీఆర్ఎస్ ముందుకు సాగుతుంది. స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి జాతీయ నేతలు రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మొన్న ములుగు నియోజకవర్గం నుంచి ప్రచారం మొదలు పెట్టారు. తెలంగాణలో అధికార పార్టీతో పాటు బీజేపీపై విమర్శలు చేస్తూ.. మరోవైపు హామీల వర్షం కురిపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు మత్రమే కాదు.. అంతకు మించిన గ్యారెంటీలు ప్రజలకు ఇస్తాం అంటూ రాహుల్ బస్సుయాత్రతో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అకస్మాత్తుగా నేటి బస్సుయాత్ర షెడ్యూల్ కుదించారు.. అగ్ర నేత  హడావుడిగా ఢిల్లీ పయణం అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అధికార పార్టీ బీఆర్ఎస్ పకడ్భందీ ప్లాన్ తో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈసారి గెలుపు తమ ఖాతాలో వేసుకొని హ్యాట్రిక్ సాధించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక అధికార పార్టీకి ఎలాగైనా చెక్ పెట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఆదిపత్యాన్ని చాటుకోవడానికి కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కూడా తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇందుకోసం జాతీయ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలో స్వయంగా రంగంలోకి దిగారు. ఈ నెల 18న ములుగు చేరుకొని రామప్ప మందిరంలో పూజలు నిర్వహించి అక్కడ నుంచే బస్సు యాత్ర మొదలు పెట్టారు. నిరుద్యోగులు, సింగరేణి కార్మికులు, మహిళలను కలిసి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే తెలంగాణకు చేసే మేలు గురించి వివరిస్తున్నారు.

రాహుల్, ప్రియాంక బస్సు యాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నిండింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ జెండా ఎగురువేయాలనే లక్ష్యంతో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఒక వైపు హామీల వర్షం కురిపిస్తూ.. ప్రత్యర్థి పార్టీలపై విమర్శల అస్త్రం కురిపిస్తూ రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ నాయకుల్లో అంతర్గతంగా ఎన్ని గొడవలు ఉన్నా.. ప్రచారంలో అంతా ఒక్కటై ముందుకుసాగుతున్నారు. షెడ్యూల్ ప్రకారం బుధ, గురువారం బస్సు యాత్ర బాగానే సాగినప్పటికీ.. మూడో రోజు శుక్రవారం అకస్మాత్తుగా షెడ్యూల్ లో మార్పులు చేశారు. ఆర్మూర్ బహిరంగ సభ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకొని అటు నుంచి ఢిల్లీలో ఎమర్జెన్సీ మీటింగ్ కి వెళ్లనున్నారు రాహుల్ గాంధి. అంతేకాదు నేడు జరగాల్సిన నిజామాబాద్ షెడ్యూల్ సైతం వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ప్రచారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతో ముఖ్యం.. అలాంటిది రాహుల్ ప్రచారలంలో ఇలాంటి మార్పులు  కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకింత కలవరం మొదలైంది. హఠాత్తుగా ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు.. అక్కడ ఏం జరుగుతుందీ అన్న ప్రశ్నలు కాంగ్రెస్ శ్రేణుల్లో మెదులుతున్నాయి. తెలంగాణలో 119 నియోజకవర్గాలకు గాను 55 ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు మాత్రమే వెల్లడించారు. మరి అభ్యర్థుల ఎంపి విషయంలో ఏదైనా గందరగోళం ఏర్పడిందా.. ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా అన్న ఆలోచనలో పడ్డారు కాంగ్రెస్ నేతలు. ఒకవేళ ఆశించిన వారికి టికెట్ లభించకుండా తిరుగుబావుట ఎగురు వేయట ఖాయం అంటున్నారు. ప్రస్తుతానికి మొదటి విడతా పూర్తయినా.. రెండో విడత బస్సు యాత్ర దసరా పండుగ తర్వాత సాగనుంది. మరి ఈసారైనా అధినేతలు ప్రచారంలో చురుకుగా పాల్గొంటారా? కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతారా లేదా అన్ని చూడాలని అంటున్నారు.

Show comments