iDreamPost
android-app
ios-app

కుషాయిగూడ: ప్రేయసి బ్రేకప్ చెప్పిందని.. కారులో తీసుకెళ్లి..

  • Published Nov 05, 2023 | 3:47 PM Updated Updated Nov 05, 2023 | 3:47 PM

ప్రేమ అంటూ అమ్మాయి వెంట పడటం.. ఆమె ఓకే చెప్పేంత వరకు ఎదురుచూడటం చేస్తుంటాడు ప్రియుడు. ప్రేమించాక.. తన శాడిజంతో చిత్ర హింసలకు గురి చేస్తుంటాడు. వారితో మాట్లాడొద్దు, వీరితో తిరగొద్దు. అది చేయొద్దు, ఇది తినొద్దు అంటూ ఆంక్షలు విధిస్తుంటాడు.

ప్రేమ అంటూ అమ్మాయి వెంట పడటం.. ఆమె ఓకే చెప్పేంత వరకు ఎదురుచూడటం చేస్తుంటాడు ప్రియుడు. ప్రేమించాక.. తన శాడిజంతో చిత్ర హింసలకు గురి చేస్తుంటాడు. వారితో మాట్లాడొద్దు, వీరితో తిరగొద్దు. అది చేయొద్దు, ఇది తినొద్దు అంటూ ఆంక్షలు విధిస్తుంటాడు.

  • Published Nov 05, 2023 | 3:47 PMUpdated Nov 05, 2023 | 3:47 PM
కుషాయిగూడ: ప్రేయసి బ్రేకప్ చెప్పిందని.. కారులో తీసుకెళ్లి..

ప్రేమ అంటే సెల్ ఫోనుల్లో చెప్పుకునే ముచ్చట్లు, వాట్సప్ స్టేటస్‌లు, బైకులపై షికార్లు, ఒక కూల్ డ్రింక్‌లో రెండు స్ట్రాలు వేసుకుని తాగడాలు కాదూ. తమ ప్రేమను నిరాకరించిన, పెళ్లి చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలించక పోయినా.. లవర్ బాగుండాలని ఆశించడం కూడా ప్రేమే అవుతుంది. కానీ నేటి ప్రేమలు.. కమర్షియల్. ఓ వ్యక్తిని ప్రేమించడం అవసరాలు తీర్చుకోవడం, ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఇందులో మరో కోణం ప్రేమికురాలు బ్రేకప్ చెప్పిందని, మరొకరితో వివాహానికి సిద్ధమైందని.. ప్రాణాలు తీసేస్తున్నారు ప్రేమికుడు. తన ప్రేమకు బ్రేకప్ చెప్పిందని లవ్వర్ పై కత్తితో దాడి చేసి.. తనను గాయపరుచుకున్నాడు.

ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని కుషాయిగూడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. డీఏఈ కాలనీకి చెందిన మెరుగు వంశీ, మౌలాలీ ఎంజే కాలనీలో నివసించే యువతి చిన్ననాటి నుండి స్నేహితులు. ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ప్రస్తుతం వీరు కీసరలోని గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి ప్రేమకు బ్రేకులు పడ్డాయి. ఇక తనను మర్చిపోవాలని ప్రియుడికి చెప్పింది ప్రేయసి. ఆమె తనకు బ్రేకప్ చెప్పడంతో తట్టుకోలేకపోయాడు వంశీ. ఆమెను చంపేయాలనుకున్నాడు. శనివారం ఆమెకు ఫోన్ చేసి.. ఓ సారి మాట్లాడాలంటూ బయటకు రావాలంటూ పిలిచాడు.

ఇద్దరు కలిసి కారులో డీఏఈ కాలనీకి వెళ్లారు. కాలనీలో ఓ మూలన కారు పార్క్ చేసి.. కారు అద్దాలు బిగించి ఆమెతో మాట్లాడాడు. ఎందుకు బ్రేకప్ చెప్పావంటూ వాదన చేశాడు. అంతలోనే తన వెంట తెచ్చుకున్న కత్తితో పొట్ట, మెడపై విచక్షణ రహితంగా పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో ఇరుగు పొరుగు గమనించి.. అక్కడకు చేరుకునే లోపు.. అతడు కూడా గాయపరుచుకున్నాడు. కాలనీ వాసులు కారు వద్దకు చేరుకుని.. అద్దాలు పగులగొట్టి కారు డోరు తెరిచారు. పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దర్ని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ఇద్దరి ప్రాణాలకు హానీ లేదని పోలీసులు పేర్కొన్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet