Navneet Kaur: సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ పై కేసు నమోదు! ఎందుకంటే..

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అలానే మాటల హద్దులు దాటుతున్న వారిపై ఎన్నికల అధికారులు కొరడ ఝళిపిస్తున్నారు. తాజాగా సినీ నటీ, ఎంపీ నవనీత్ కౌర్ పై కేసు నమోదైంది.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అలానే మాటల హద్దులు దాటుతున్న వారిపై ఎన్నికల అధికారులు కొరడ ఝళిపిస్తున్నారు. తాజాగా సినీ నటీ, ఎంపీ నవనీత్ కౌర్ పై కేసు నమోదైంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం  కొనసాగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి గడపకు వెళ్తు ఓటర్లను ప్రసన్నం చేసుకునే  పనిలో పడ్డారు. ఇదే సమయంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో కొందరు నేతలు చేసే వ్యాఖ్యలు వారిని ఇరకాటంలో పడేస్తున్నాయి. తాజాగా సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ పై  ఓ విషయంలో కేసు నమోదైంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి సహనం కోల్పోయి నోటికి పనిచెబుతున్నారు. తాజాగా, బీజేపీ నేత, అమరావతి ఎంపీ నటి నవనీత్ కౌర్ రాణా, హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మాటల యుద్ధం సాగింది. ఇక సినీ నటీ, బీజేపీ ఎంపి నవనీత్ కౌర్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో అనేక సినిమాల్లో నటించి..తెలుగమ్మాయిగా మారిపోయింది. ఇది ఇలా ఉంటే.. ఆమె ప్రస్తుతం మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ స్థానం నుంతి బిజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది.

ఈ క్రమంలోనే స్టార్ క్యాంపెయినర్ గా పలు రాష్ట్రాల్లో ప్రచార సభల్లో పాల్గొంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల షాద్ నగర్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా రోడ్ షో నిర్వహిచింది. ఈ క్రమంలో ఆమె కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేసింది.  కాంగ్రెస్ కు ఓటేస్తే పాకిస్తాన్ కి వేసినట్టేనంటూ వ్యాఖ్యానించింది. నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసీ అధికారుల ఫిర్యాదుతో  ఐపీసీ 188 సెక్షన్‌ కింద ఆమెపై ఐపీసీ 188 సెక్షన్‌ కింద  నమోదుచేశారు. రంగా రెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైంది.

గురువారం తెలంగాణలో నవనీత్ కౌర్  చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె ఎంఐఎం అధ్యక్షుడు అసద్దిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం నేతలకు 15 నిమిషాలు అవసరమైతే.. అదే తమకు పోలీసులు పక్కకు తప్పుకుంటే కేవలం 15 సెకన్లు చాలని, తాము తల్చుకుంటే ఎక్కిడికిపోతారో తెలియదంటూ ఓవైసీకీ నవనీత్ కౌర్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అలానే ఈ ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువుర నేతలకు ఈసీ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రచారాల్లో వారు చేసే వ్యాఖ్యలపై ఆంక్షలు  విధిస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలకు నోటీసులు సైతం జారీ చేశారు. తాజాగా నవనీత్ కౌర్ పై ఏకంగా కేసు నమోదైంది.

Show comments