P Venkatesh
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బిగ్ అలర్ట్ జారీ చేసింది. అది ఉంటేనే పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నట్టు వెల్లడించింది.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బిగ్ అలర్ట్ జారీ చేసింది. అది ఉంటేనే పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నట్టు వెల్లడించింది.
P Venkatesh
తెలంగాణలో పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 1,2,3 కింద పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కాగా గతంలో గ్రూప్ 1 పరీక్షలో అవకతవకల కారణంగా గ్రూప్ 1 పరీక్ష రద్దైన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ రీ నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాగా గ్రూప్ 1 కు సంబంధించిన ప్రిలిమరీ పరీక్ష ఈ నెల 09న జరుగనున్నది. ఈ నెల 9వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓఎంఆర్ విధానంలో రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. అయితే అభ్యర్థులు హాల్ టికెట్ పై ఫోటో అతికించుకుని వెళ్తేనే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు.
గ్రూప్ 1 కు ప్రిలిమారీ రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. కాగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌పై లేటెస్ట్ పాస్ ఫొటో తప్పనిసరిగా అతించుకోని వెళ్లాల్సి ఉంటుంది. మూడు నెలల క్రితం నుంచి నేటి వరకు తీయించుకున్న పాస్ ఫొటోను తప్పనిసరిగా హాల్ టికెట్ పై అతికించుకోవాలి. హాల్ టికెట్‌పై అభ్యర్థి తన ఫొటో పేస్ట్ చేయకపోతే ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించరు.
ఈ నిబంధనను హాల్ టికెట్‌లో పొందుపరిచినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు తెలిపారు. ఫొటో కింద సంతకం చేసేందుకు తప్పనిసరిగా స్పేస్ ఉంచుకోవాలని సూచించారు. హాల్ టికెట్‌తో పాటు పాస్ పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఒరిజినల్ కార్డును పరీక్షా కేంద్రం వద్ద చూపిస్తేనే పరీక్షకు అనుమతిస్తారు. గ్రూప్ 1 కింద పలు విభాగాల్లో 563 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక గ్రూప్ 1మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21 2024లో నిర్వహించనున్నారు.