iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కష్టాలకి చెక్.. త్వరలో బెంగళూరు మోడల్!

Hyderabad Metro: ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెడుతూ, తక్కువ ధరలోనే ఏసీలో ప్రయణించే అవకాశాన్ని కల్పించిన హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు మరో సదవకాశాన్ని కల్పించింది. ఈ క్రమంలోనే తరచూ అనేక కీలక నిర్ణయాలను హైదరాబాద్ మెట్రో తీసుకుంటుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది.

Hyderabad Metro: ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెడుతూ, తక్కువ ధరలోనే ఏసీలో ప్రయణించే అవకాశాన్ని కల్పించిన హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు మరో సదవకాశాన్ని కల్పించింది. ఈ క్రమంలోనే తరచూ అనేక కీలక నిర్ణయాలను హైదరాబాద్ మెట్రో తీసుకుంటుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది.

హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కష్టాలకి చెక్.. త్వరలో బెంగళూరు మోడల్!

హైదరాబాద్ మహానగరంలో  రోజు రోజుకూ జనాభా పెరిగిపోతుంది. ఇదే సమయంలో ట్రాఫిక్ సమస్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఈ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ నగర వాసుల ప్రయాణాన్ని హైదరాబాద్ మెట్రో మరింత సులభతరం చేసిన సంగతి తెలిసింది. ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనులు చేసుకునేవారు మెట్రోలో ప్రయాణించడానికే మొగ్గు చూపుతున్నారు. ప్రయాణికులను ఆకర్షించేందుకు హైదరాబాద్ మెట్రో అథారిటి కూడా పలు రకాలైన ఆఫర్లను ప్రకటిస్తుంది. అంతేకాక ప్రయాణికు జర్నీ మరింత సుఖవంతం చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. ఇదే సమయంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచే దిశాకీలక అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సంఖ్యను, ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే  కొన్ని ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి డైరెక్ట్ గా మెట్రో స్టేషన్ల  పాయింట్ల  వద్దకే బస్సు సర్వీస్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది. తద్వారా ఆదాయం పెంచుకోవచ్చనే భావనలో  హైదరాబాద్ మెట్రో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం బెంగళూరులో అమలవుతున్న మోడల్ ను హైదరాబాద్ లో ప్రారంభించాలని చూస్తుంది. ఇక బెంగళూరులో  చూసినట్లు అయితే.. అక్కడ మెట్రో ఫీడర్ బస్ సర్వీస్ పాయింట్లను ఏర్పాటు చేశారు.

Metro

ఇలా ఈ బస్ సర్వీస్ పాయింట్లను పెంచడం ద్వారా మెట్రో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బెంగళూరు మెట్రో అధికారులు విడుదల చేసిన కొన్ని గణాంకాలను చూసినట్లు అయితే.. ఆ విషయం అర్థమవుతుంది. గతేడాది డిసెంబర్ వరకు బెంగళూరు నగరంలోని 65 మెట్రే స్టేషన్లలో రోజుకూ  రూ.5.60 లక్షల మంది ప్రయాణించారు. అదే మెట్రో ఫీడర్ బస్స్ సర్వీస్ పాయింట్లు పెంచిన తరువాత.. ప్రస్తుతం రూ.6.80 నుంచి రూ.7.50 లక్షలకు పెరిగింది. ఇలా బస్ సర్వీస్ పాయింట్లను ఏర్పాటు చేయడం ద్వారా బెంగళూరు మెట్రో ఆదాయం పెంచుకుంది. తాజాగా బెంగళూరులో అమలవుతున్న మోడల్ నే హైదరాబాద్ లో అమలు చేయాలనే యోచనలో మెట్రో అధికారులు ఉన్నారు.