P Krishna
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశారు. దీని ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవొచ్చు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశారు. దీని ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవొచ్చు.
P Krishna
ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. డిసెంబర్ 3 న ఫలితాలు వెలువడ్డాయి.. కాంగ్రెస్ పార్టీ దిగ్విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తొలి సంతకం ఆరు గ్యారెంటీలపై చేశారు. ఇప్పటికే మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ పథకం ద్వారా మహిళలు సంతోష పడుతున్నా.. కొంతమంది మంది సిబ్బంది దుర్వినియోగం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరుగ్యారెంటీ పథకాల్లో ఒకటి మహాలక్ష్మి పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు, ట్రాన్స్ జెండర్లు జీరో టికెట్ ద్వారా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ పథకాన్ని కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారి వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరుగ్యారెంటీ పథకాల్లో ఒకటి మహాలక్ష్మి పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు, ట్రాన్స్ జెండర్లు జీరో టికెట్ ద్వారా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పథకాన్ని కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారి వార్తలు వస్తున్నాయి. మహబూబ్ నగర్ నుంచి తాండూర్ వెళ్తున్న బస్సు (టీఎస్ 34 టీఏ 5189) లో ఉన్న కండెక్టర్ సీటులో కూర్చొని మహిళా ప్రయాణికులు ఎక్కకున్నా 10 నుంచి 20 టిక్కెట్లు ఇష్యూ చేశాడు. 100 శాతం ఆక్యూపెన్సీ రెషియో పెంచడం కోసం టెకెట్లు ప్రింట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల చేతివాటం!
100 శాతం ఆక్యుపెన్సీ రేషియో పెంచడం కోసం మహిళా ప్రయాణికులు ఎక్కిన దాని కన్నా ఎక్కువ జీరో టిక్కెట్లు కొడుతున్న ఆర్టీసీ కండక్టర్లు.
ఉత్తి పుణ్యానికి జీరో టిక్కెట్లు కొడుతూ ప్రభుత్వం ధనం వృధా చేస్తున్న కండక్టర్లు.
మహబూబ్ నగర్ నుండి తాండూరు… pic.twitter.com/Ht6fnPZP4q
— Telugu Scribe (@TeluguScribe) December 24, 2023