Krishna Kowshik
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. నగదు పెద్ద మొత్తంలో చేతులు మారుతుంది. ఇటీవల కాలంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో నోట్ల కట్టలు, బంగారం పెద్ద యెత్తున స్వాధీనం చేసుకున్న సంగతి విదితమే. తాజాగా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. నగదు పెద్ద మొత్తంలో చేతులు మారుతుంది. ఇటీవల కాలంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో నోట్ల కట్టలు, బంగారం పెద్ద యెత్తున స్వాధీనం చేసుకున్న సంగతి విదితమే. తాజాగా
Krishna Kowshik
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 30న శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల హామీలతో ప్రచారాలను విస్తృతం చేస్తున్నారు ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, నేతలు. ప్రజల వద్దకు వెళుతూ.. సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇదే సమయంలో మద్యం ఏరులై పారుతుంది. అలాగే పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు చేతులు మారుతున్నాయి. ప్రజలను ప్రలోభాలకు గురి చేసేందుకు మందు, నోట్లు, బంగారం, ఇంటి సామాగ్రి వంటి ఎర వేస్తున్నాయి పలు పార్టీలు. ఎన్నికల కోడ్ అలా వచ్చిందో లేదో నగరంలోకి భారీ నగదు తరలిస్తుండగా.. పోలీసులు తనిఖీలు చేపట్టి పట్టుకున్న సంగతి విదితమే.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడ చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 650 కోట్లకు పైగా విలువైన డబ్బు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ అప్పా జంక్షన్ వద్ద చేపట్టిన తనిఖీల్లో రూ. 6.5 కోట్లను పోలీసులు సీజ్ చేసిన సంగతి విదితమే. ఆరు కారుల్లో ఈ నోట్ల కట్టలు బయటకు వచ్చాయి. నిన్న అంబర్ పేటలో సుమారు రూ. 2 కోట్లను స్వాధీనం చేసుకున్నారు ఖాకీ బాసులు. ఎన్నికల అధికారులు, పోలీసుల జరుపుతున్న తనిఖీల్లో క్యాష్ కనిపిస్తే.. వాటిని సరైన ఆధారాలు చూపించనట్లయితే.. వాటిని సీజ్ చేస్తున్నారు. తాజాగా పెద్ద మొత్తంలో డబ్బును వెలికి తీశారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీ నగదు లభ్యమైంది. రెండు కార్లలో 5 కోట్ల రూపాయాలను తరలిస్తుండగా పట్టుకున్నారు. కొండాపూర్ బొటానికల్ రోడ్డు నుండి చిరెక్ పబ్లిక్ స్కూల్ వైపుగా కార్లలో నోట్ల కట్టలను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో.. పహారా కాసి, సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ రెండు కార్లలో రూ. 5 కోట్లను తరలిస్తుండగా.. గుర్తించి..సీజ్ చేశారు. ఆ మొత్తం ఓ వ్యాపార వేత్తదిగా తెలుస్తోంది. ఆ సీజ్ చేసిన నగదును ఐటీ శాఖకు అప్పగించారు పోలీసులు. ఇంకా ఎన్నికలకు వారం రోజులే సమయం ఉండటంతో పెద్ద మొత్తంలో డబ్బులు తరలిపోతున్నాయి. ఇదంతా కూడా ప్రజలకు ఎర వేసేందుకేనని తెలుస్తోంది.