దండం పెడ్తా.. కారు గుర్తుకు ఓటేయ్యండి.. మహిళలను అభ్యర్థించిన మల్లారెడ్డి !

Malla Reddy Mass Speech: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మే 13న జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ప్రధాన పార్టీలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి తనదైన శైలీలో ప్రసంగాలు ఇస్తూ ప్రచారంలో బిజీగా ఉన్నారు.

Malla Reddy Mass Speech: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మే 13న జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ప్రధాన పార్టీలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి తనదైన శైలీలో ప్రసంగాలు ఇస్తూ ప్రచారంలో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రచారంలో అన్ని ప్రధాన పార్టీలు బిజీ బిజీగా ఉన్నాయి. తెలంగాణలో సైతం ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తెగ కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే  మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి..తనదైన స్టైల్ లో ప్రచారం చేశారు. దండం పెడ్తా, కాళ్లు మొక్తా కారు గుర్తుకే ఓటేయ్యండి అంటూ మహిళలను మల్లారెడ్డి అభ్యర్థించారు.

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన స్టైల్ లో మాట్లాడుతూ.. అందరిని ఆకట్టుకుంటారు. ఇక ఎన్నికల ప్రచారంలో సైతం తనదైన పంథాలో దూసుకెళ్తుంటారు. సోమవారం రాత్రి మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ఇంపీరియల్ గార్డన్స్ లో కంటోన్మెంట్ మహిళ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి వారికి వివరించారు.

అలానే దివంగత నేత, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గురించి ప్రస్తావించారు. సాయన్న30 ఏళ్ల పాటు కంటోన్మెంట్ ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు. మహిళల అభివృద్ధి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. ఇటీవలే సాయన్న కుమార్తె లాస్య నందిత చనిపోయారని, ఆయన రెండో కుమార్తె నివేదితను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే వారి ఆత్మ శాంతిస్తుందని పేర్కొన్నారు.  అలానే అందరికి దండపెడ్తా కారు గుర్తుకే ఓటేయ్యండి అంటూ అక్కడికి వచ్చిన మహిళలను మల్లారెడ్డి అభ్యర్థించారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..  ఈ ప్రాంత సమస్యలను పార్లమెంట్‌లో ప్రశ్నించేందుకు కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Show comments