Dharani
Malla Reddy Daughter In Law Preethi Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి ఎంత ఫేమసో.. ఆయన కోడలు ప్రీతి రెడ్డి కూడా అంతే ఫేమస్. ఈ క్రమంలో ఆమెకు తాజాగా అరుదైన అవార్డు లభించింది. ఆ వివరాలు..
Malla Reddy Daughter In Law Preethi Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి ఎంత ఫేమసో.. ఆయన కోడలు ప్రీతి రెడ్డి కూడా అంతే ఫేమస్. ఈ క్రమంలో ఆమెకు తాజాగా అరుదైన అవార్డు లభించింది. ఆ వివరాలు..
Dharani
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పవర్‌ఫుల్ డైలాగ్‌లు, పంచులతో ప్రసంగాలు చేస్తూ.. సినిమా హీరోలకు మించి క్రేజ్ సంపాదించుకున్నారు మల్లారెడ్డి. ఇక ఆయన కోడలు ప్రీతి రెడ్డి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. ఎన్నికల వేళ మామ మల్లారెడ్డి తరఫున తనదైన మార్క్ ప్రచారం చేశారు ప్రీతి రెడ్డి. అంతేకాక అనేక ఇంటర్వ్యూల్లో.. తన అత్తమామల గొప్పతనాన్ని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రీతి రెడ్డికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త తెలిసింది. మల్లారెడ్డి విద్యాసంస్థల ద్వారా.. విద్యా, వైద్య రంగాల్లో ఆమె చేస్తోన్న సేవలకు గాను.. అరుదైన అవార్డు వచ్చింది. ఆ వివరాలు..
మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డిని అరుదైన అవార్డు వరించింది. మల్లారెడ్డి సంస్థల ద్వారా ఆమె చేస్తోన్న సేవలకు గాను.. ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డుకు ఆమె ఎన్నికయ్యింది. ఇక ఇటీవల ముంబైలో ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ కమిటీ చైర్మన్ నందన్ జా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రీతి రెడ్డికి అవార్డును అందించారు. మాజీ ఛీఫ్ జస్టిస్, ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఇండియా మాజీ ఛైర్మన్ కేజీ బాలకృష్ణన్ చేతుల మీదుగా ప్రీతి రెడ్డి ఈ అవార్డు అందుకున్నారు.
మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ ఛైర్మన్‌గా వైద్య, విద్యారంగంలో అందరికీ మంచి ఆరోగ్యం అందించడంలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు.. డాక్టర్ సీహెచ్ ప్రీతి రెడ్డి. అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్‌గా అందరికీ ముఖ్యంగా మహిళలకు ఉన్నత విద్యను అందించడంలో తన వంతు కృషి చేస్తున్నారు. ఇక మల్లారెడ్డి హెల్త్ సిటీలో.. 2 మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజీలు అదేవిధంగా మల్లారెడ్డి మహిళా కాలేజీ కూడా ఉంది.
ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ప్రతి మెడికల్ కాలేజ్ నుంచి 200 ఎంబీబీఎస్ సీట్లను ప్రత్యేకంగా అమ్మాయిల కోసమే కేటాయిస్తూ.. వారికి ఉన్నత విద్య అందించేందుకు కృషి చేస్తున్నారు. అత్యున్నత వైద్య సదుపాయాలతో మంచి వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ప్రీతి రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న మల్లారెడ్డి యూనివర్సిటీ తెలంగాణలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీగా గుర్తింపు తెచ్చుకుంది.
అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ కింద స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ హెల్త్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లాంటి ఆరు విద్యా సంస్థలు ఉన్నాయి. ఏటా యూనివర్సిటీ ద్వారా 5000 మందికి సీట్లు ప్రొవైడ్ చేస్తున్నారు. మల్లారెడ్డి కోడలిగా, మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ ఛైర్మన్ గా, మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్‌గా వైద్య, విద్యా రీత్యా ప్రజలకు, విద్యార్థులకు ఎనలేని సేవలు చేస్తున్నందుకు గానూ.. ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డుతో ప్రీతి రెడ్డిని సత్కరించారు.
అలారు ఏఎంఆర్ సంస్థ ఛైర్మన్, ఎండీ ఎ.మహేష్ రెడ్డిని కూడా ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డు వరించింది. ఆయన చేసిన అనేక ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు గానూ ఈ అవార్డు అందుకున్నారు. వీరితో పాటు.. సినీ తార శిల్పాశెట్టి, సోనూసూద్, సౌరబ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ తదితరులను దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో చేసిన సేవలకు గాను గుర్తించి సన్మానించారు.