Arjun Suravaram
నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉన్నారు. ఈక్రమంలో ఓ విద్యార్థిని పెట్టిన వీడియోకు ఆయన ఎమోషనల్ ట్వీట్ చేశారు.
నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉన్నారు. ఈక్రమంలో ఓ విద్యార్థిని పెట్టిన వీడియోకు ఆయన ఎమోషనల్ ట్వీట్ చేశారు.
Arjun Suravaram
ఆర్ఎస్ ప్రవీణ్.. ఈ పేరు గురించి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం అనుభవం ఉన్నవారికి, యువతకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారిగా పని చేశారు. తనదైన శైలీలు విధులు నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందారు. సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖలో పని చేసిన ఆయన.. కొన్నేళ్ల క్రితం రాజీనామా చేసి పొలిటిల్ ఎంట్రీ ఇచ్చారు. బీఎస్పీలో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇటీవలే బీఆర్ఎస్ పార్టీలోకి చేరి..నాగర్ కర్నూల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంకితా అనే విద్యార్థి చేసిన ట్వీట్ కు ఆర్ఎస్ ప్రవీణ్ ఫిదా అయ్యారు. అంతేకాక ఆయనకు ఎమెషనల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
హైదరాబాద్‌కు చెందిన అంకిత అనే విద్యార్థిని తాను చదువులు ఉన్నత స్థితికి చేరుటకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారణమని సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇంకా ఆ విద్యార్థిని అనేక అంశాలను ఆ వీడియోలు ప్రస్తావించింది. సాధారణ బస్తీ నుంచి బెంగళూరులో అజీజ్ ఫ్రేమ్‌జీ యూనివర్సిటీలో చదువుకునే స్థాయికి తాను చేరానంటే దానికి పరోక్షంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే కారణమని అంకిత వెల్లడించారు. తాను ఆరో తరగతిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో చేరినట్లు ఆమె తెలిపారు. ఆకాశమే మీ హద్దు అని మీరు నింపిన స్ఫూర్తి ఎనలేనిదని అంకిత కొనియాడారు. ఓ తండ్రిలా తనలాంటి ఎంతో మంది విద్యార్థులను చేయి పట్టి నడిపించారని ఆమె తెలిపింది. అలాంటి మంచి వ్యక్తిని నాగర్ కర్నూల్ లోక్ సభ ఎంపీగా గెలిస్తే మరింత మందికి సర్వీస్ చేస్తారని అంకిత తెలిపింది. ఇక అంకిత మాట్లాడిన ఆ వీడియోను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఎక్స్ అకౌంట్ లో పోస్టు చేశారు. అంతేకాక ఈ వీడియో చూసిన ఆయన ఎమోషనల్ అయ్యారు. తిరిగి రీ ట్వీట్ చేశారు.
“ఓ తండ్రిలా ఈ రోజు గర్విస్తున్నా.. చాలా కృతజ్ఞతలు అంకిత. నువ్వు ఈ రోజు నన్ను గర్వపడేలా చేశావు. మీలాంటి లక్షలాది మంది పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలను గొప్ప విశ్వవిద్యాలయాల్లో చదివి ఉన్నత స్థితిలో ఉండాలని నేను సంకల్పించాను. నాగర్ కర్నూల్ నాకు అండగా నిలుస్తుందని ఆశిస్తున్నాను.” అని ప్రవీణ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ ఐపీఎస్ గా పని చేస్తున్న సమయంలో గురుకులాల్లో చదివిన విద్యార్థుల కోసం స్వెరోస్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థుల శ్రేయస్సు కోసం విరాళాలు సేకరించారు. పేద విద్యార్థుల మంచి భవిష్యత్ కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. తాజాగా ట్వీట్ చేసిన అంకిత అనే విద్యార్థిని కూడా ఈ సంస్థ నుంచే ఉన్నత స్థాయికి వెళ్లింది. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. మరి..ఆర్ఎస్ ప్రవీణ్ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
As a father, you have made me feel proud today, Ankita. Thanks a million 🙏
I am determined to make millions of poor and underprivileged kids like you study in great universities and land in higher places. Hope NagarKurnool stands by my side.#KCROnceAgain #RSP4NGKL@KTRBRS pic.twitter.com/srqC1LsCQk— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) April 9, 2024