హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు.. KCRను లేకుండా చేయాలని చేస్తున్నారంటూ..!

మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్​ను లేకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు. ఆయన ఇంకా ఏమేం అన్నారంటే..

మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్​ను లేకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు. ఆయన ఇంకా ఏమేం అన్నారంటే..

మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్​ను లేకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీని బీఆర్ఎస్ నేతల బృందం శుక్రవారం నాడు సందర్శించింది. కుంగిన పిల్లర్ నంబర్ 20ని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వం అంటే విపక్షాలు లేవనెత్తిన సమస్యలకు సమాధానం చెప్పాలని.. కానీ దురదృష్టవశాత్తు అలా జరగడం లేదన్నారు. ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పొద్దని ఆ రోజు నల్గొండలో కేసీఆర్ సభ పెడితే.. ఇదే కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డపై డైవర్షన్ పాలిటిక్స్ చేసిందన్నారు.

మేడిగడ్డ పర్యటకు బీఆర్ఎస్ నేతలు వస్తే.. అదే సమయానికి పాలమూరు ఎత్తిపోతల దగ్గర కాంగ్రెస్ ఇంకో యాత్ర పెడుతోందని హరీష్​ రావు సీరియస్ అయ్యారు. ఇది చిల్లర ప్రయత్నం తప్ప.. బాధ్యతాయుత ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు కాదన్నారు. ప్రతిపక్షానికి స్పేస్ లేకుండా చేయాలనే చీప్ టాక్టిక్స్​తో ఇది భాగమని విమర్శించారు. ఇందులో పైశాచిక ఆనందం తప్ప.. ఒక ప్రభుత్వం అవలంభించాల్సిన విధానం మాత్రం కనిపించడం లేదని దుయ్యబట్టారు. ప్రజాక్షేత్రంలో బీఆర్​ఎస్​ను పడగొట్టాలంటే కాళేశ్వరాన్ని పడగొట్టాలనే కుటిల ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డిలో కనిపిస్తోందన్నారు హరీష్. కేసీఆర్ ఆనవాలు కూడా లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ అసెంబ్లీలో అన్నారని గుర్తుచేశారు. ఆయన దేనికైనా ఒడిగడతారని తమకు అనుమానాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తానన్న వ్యక్తి.. ఆయన కట్టిన కాళేశ్వరాన్ని కూడా పడగొట్టాలని చూస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమంలో రేవంత్ పాల్గొన్న దాఖలాలు లేవని.. కనీసం పరిపాలనలో అయినా నిజాయితీగా వ్యవహరించాలని హరీష్ రావు పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ నేతలు పదే పదే అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అసలు అవినీతి గురించి మాట్లాడే నైతిక​ హక్కు కాంగ్రెస్​కు ఉందా? అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. దేశంలో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన స్కాములను తీస్తే చాంతాడంత లిస్టు ఉంది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఈపీసీ పద్ధతిని తీసుకొచ్చి కాంగ్రెస్ అవినీతికి గేట్లు తెరిచింది. మేం అధికారంలోకి వచ్చాక ఈపీసీని రద్దు చేశాం. అలాగే వాళ్లు పెట్టిన మొబిలైజేషన్ అడ్వాన్స్​ను తీసేశాం. మీలా మేం తెలంగాణ ప్రజల్ని గోసపెట్టదలచుకోలేదు’ అని హరీష్​ రావు చెప్పుకొచ్చారు. మరి.. కేసీఆర్​ను లేకుండా చేయాలని చూస్తున్నారంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అంబానీ కొడుకు గొప్ప మనసు! అతనిపై జోకులు వేస్తున్నారా?

Show comments