iDreamPost

అంబానీ కొడుకు గొప్ప మనసు! అతనిపై జోకులు వేస్తున్నారా?

  • Published Mar 01, 2024 | 8:24 PMUpdated Mar 01, 2024 | 8:24 PM

ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ ప్రీ వెడ్డింగ్​తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. అయితే చాలా మంది అతడి గురించి తప్పుడు అభిప్రాయాలతో ఉంటారు. అనంత్​పై జోకులు వేస్తుంటారు. కానీ అసలు నిజం ఏంటో తెలిస్తే అతడ్ని మెచ్చుకోకుండా ఉండలేరు.

ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ ప్రీ వెడ్డింగ్​తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. అయితే చాలా మంది అతడి గురించి తప్పుడు అభిప్రాయాలతో ఉంటారు. అనంత్​పై జోకులు వేస్తుంటారు. కానీ అసలు నిజం ఏంటో తెలిస్తే అతడ్ని మెచ్చుకోకుండా ఉండలేరు.

  • Published Mar 01, 2024 | 8:24 PMUpdated Mar 01, 2024 | 8:24 PM
అంబానీ కొడుకు గొప్ప మనసు! అతనిపై జోకులు వేస్తున్నారా?

పైకి లావుగా, పెద్దగా ప్రత్యేకతలు లేనివాడిలా కనిపిస్తాడు ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ ముకేశ్ అంబానీ కొడుకు అనంత్. చూడగానే అట్రాక్ట్ అయ్యేంత అందగాడు కాదు. మాటలతో అందర్నీ ఆకట్టుకుంటాడా అంటే అదీ లేదు. చాలా పొదుపుగా మాట్లాడతాడు. భారీ కాయం వేసుకొని ఐపీఎల్​ మ్యాచులు చూస్తూ స్టేడియాలో సందడి చేసే అనంత్ అంబానీ అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది. అంబానీ కొడుకు అనగానే అందరూ లైఫ్ సెటిల్ అనుకుంటారు. తండ్రి కోటీశ్వరుడు కాబట్టి ఒక్క పని కూడా చేయనక్కర్లేదు. క్రికెట్ టీమ్​ను కొనేయొచ్చు. సినీ తారలతో కలసి డిన్నర్ చేయొచ్చు. ఏ దేశమంటే ఆ దేశం తిరగొచ్చు. లగ్జరీ లైఫ్​ను లీడ్ చేయొచ్చని.. అనంత్ అంబానీ గురించి చాలా మంది పొరబడతారు.

అనంత్ అంబానీ చాలా లక్కీ అని.. ఏ స్పెషాలిటీ లేకున్నా తండ్రి సంపాదించిన ఆస్తితో జులాయిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడని అనుకుంటారు. కానీ అతడి లైఫ్​ గురించి తెలిస్తే మాత్రం విమర్శలు చేయడానికి జడుసుకుంటారు. తిట్టిన నోళ్లే నువ్వు గ్రేట్ బాస్ అంటూ మెచ్చుకుంటాయి. అలాంటి అనంత్ జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 28 ఏళ్ల అనంత్ అంబానీ​ తన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్​తో మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఎన్​కోర్ హెల్త్​కేర్ సంస్థ సీఈవో వీరెన్ మర్చంట్-షైలా మర్చంట్​ ఏకైక కుమార్తె రాధికా మర్చంట్​ను అతడు పెళ్లి చేసుకోబోతున్నాడు. జులై 12వ తేదీన వీరి వివాహం జరగనుంది. అయితే అంతకంటే ముందు ప్రీ వెడ్డింగ్ సెర్మనీ మీదే అందరి ఫోకస్ నెలకొంది. ఈ నేపథ్యంలో అనంత్ అంబానీ జీవితం గురించి, అలాగే అతడు ఎందుకు అంత గ్రేట్ అనేది ఇప్పుడు చూద్దాం..

You must know about anant ambani greatness

జంతు సంరక్షకుడు
అనంత్ అంబానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. సమాజంపై అతడికి ఉన్న అవగాహన కూడా అద్భుతమనే చెప్పాలి. సినీ తారల నుంచి బిజినెస్​మెన్​, స్పోర్ట్స్ స్టార్స్ వరకు అందరూ పెళ్లి కోసం విదేశాలకు వెళ్తుంటే అనంత్ మాత్రం సొంతూరు గుజరాత్​లోని జామ్​నగర్​లోనే వివాహం చేసుకుంటున్నాడు. మాతృభూమి, కర్మభూమిని తాను ఎప్పుడూ మర్చిపోనని అంటున్నాడు. పైకి చూడటానికి తల్లి కొంగుచాటు బిడ్డలా, తండ్రి ఆస్తిని ఎంజాయ్ చేసే జులాయిలా కనిపించే అనంత్​లో.. తరచి చూస్తే సమాజం కోసం అహర్నిషలు పరితపించే బాధ్యత గల ఓ మంచి మనిషి కనిపిస్తాడు. జామ్​నగర్​లో 3 వేల ఎకరాల్లో ఓ సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పాడతను. ఇందులో గాయపడిన, ఆదరణ కోల్పోయిన, వేటగాళ్ల చేతుల్లో బందీ అయిన వన్యప్రాణులను రక్షించి చికిత్స చేయడం, పునరావాసంపై దృష్టి పెడుతున్నాడు. ఈ సంరక్షణ కేంద్రానికి ‘స్టార్ ఆఫ్​ ది ఫారెస్ట్ వంతారా’ అని నామకరణం చేశాడు.

స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్​ వంతారాతో పాటు అనంత్ అంబానీ మరో సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే జామ్​నగర్​లోని రిలయన్స్ రిఫైనరీలో అక్కడి ప్రభుత్వ సహకారంతో జూను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులోని సంరక్షణ కేంద్రంలో సుమారు 200 ఏనుగులు, 100 రకాల ఇతర జంతువులు ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా చూసుకోవడానికి 3 వేల మంది సిబ్బంది ఉన్నారు. ఈ జూ తన తల్లిదండ్రుల కలల రూపం అని ఓ సందర్భంలో అనంత్ అంబానీ అన్నాడు. జంతు సంరక్షణ విషయంలో ఇంకా చేపట్టాల్సిన చర్యలు చాలా ఉన్నాయని చెప్పాడు. వీటి అమలు కోసం కృషి చేస్తున్నానని తెలిపాడు.

మాతృభూమిపై ఎనలేని ప్రేమ
జంతు సంరక్షణతో పాటు అనంత్​లో ఇంకా చాలా మంచి గుణాలు ఉన్నాయి. మాతృభూమి అంటే అతడికి ఎంతో ఇష్టం. కొన్ని పెద్ద కుటుంబాల్లో పిల్లలు పెళ్లిళ్లు విదేశాల్లో చేసుకుంటున్నారు. కానీ అనంత్ మాత్రం జామ్​నగర్​లోనే తన వివాహం జరగాలని నిశ్చయించుకున్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’లో వెడ్ ఇన్ ఇండియాను అలవర్చుకోమంటూ చెప్పిన మాటలు తన మనసును తాకాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని రీసెంట్​గా ఓ​ ఇంటర్వ్యూలో అనంత్ వెల్లడించాడు. జామ్​నగర్​లోనే పుట్టి, పెరిగానని.. ఇక్కడే వేడుకను ప్లాన్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. ఇది తన తండ్రి జన్మభూమి అని, తనకు కర్మభూమి అని చెప్పుకొచ్చాడు.

You must know about anant ambani greatness

ఉన్నదంతా ఆ భగవంతుడిదే..
దేవుడు, మతం లాంటి విషయాల్లోనూ అనంత్​కు చాలా అవగాహన ఉంది. భగవద్గీతను 9 సార్లు చదివానని.. దేవుడు ప్రతి చోటా ఉన్నాడని నమ్ముతానని ఆ ఇంటర్వ్యూలోనే అతడు తెలిపాడు. తమకు ఉన్నదంతా భగవంతుడి ద్వారానే అందిందని నమ్ముతామన్నాడు. సనాతన ధర్మాన్ని ఆచరించే కుటుంబంలో పుట్టడం అదృష్టంగా భావిస్తానని వివరించాడు. ఇవన్నీ చూస్తే పైకి కనిపించే అనంత్​కు.. ప్రపంచానికి తెలియని, బయటకు కనిపించని అనంత్​కు చాలా తేడా ఉందని చెప్పాలి. వన్యప్రాణుల సంరక్షణ కోసం పడుతున్న కష్టం, సొంతదేశంపై ప్రేమ, వాత్సల్యం, ఆధ్యాత్మిక అంశాలపై అతడికి ఉన్న ఆసక్తి, అవగాహన చూస్తుంటే మెచ్చుకోకుండా ఉండలేం. ముకేశ్ అంబానీ వ్యాపారానికి సరైన వారసుడో కాదో పక్కనబెడితే.. అంబానీ కుటుంబం చేసే సేవా కార్యక్రమాలు, మంచి పనులను ముందుకు తీసుకెళ్లడంలో ఇంత కంటే మంచోడు, సమర్థుడు దొరకడని మాత్రం చెప్పొచ్చు. మరి.. అనంత్ అంబానీ లైఫ్​ గురించి తెలుసుకున్నాక మీకేం అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఫోర్డ్ భారత్ కు ఎందుకు తిరిగి వస్తోంది.. అసలు కారణం ఇదే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి