iDreamPost
android-app
ios-app

ఆకట్టుకుంటున్న BRS ‘బలగం’ యాడ్స్!

  • Published Nov 12, 2023 | 11:00 AM Updated Updated Nov 12, 2023 | 11:00 AM

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో అన్ని ప్రధాన పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. ఇక అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే బలగం థీమ్ తో యాడ్స్ రూపొందించి.. ప్రజలను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో అన్ని ప్రధాన పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. ఇక అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే బలగం థీమ్ తో యాడ్స్ రూపొందించి.. ప్రజలను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Published Nov 12, 2023 | 11:00 AMUpdated Nov 12, 2023 | 11:00 AM
ఆకట్టుకుంటున్న BRS ‘బలగం’ యాడ్స్!

కథలో దమ్ముండాలే గానీ.. ప్రేక్షకులు  నెత్తిన పెట్టుకుంటారు. దానికి చిన్న సినిమా, పెద్ద సినిమా అనే సంబంధం లేదు.  అలా అదిరిపోయే కథలో మన ముందుకు వచ్చిన చిత్రం బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో ఈ బలంగ సినిమా తెరకెక్కింది.  చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. అఖండ విజయాన్ని సొంతం చేసుకుని గొప్ప సినిమాగా నిలిచింది. అంతేకాక ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ అవార్డులను సైతం ఈ సినిమా గెలుచుకుంది. ఇంకా చెప్పాలంటే.. ప్రతి ఒక్కరి నోట, ప్రతి చోట బలగం పేరే వినిపిస్తుంది. తాజాగా ఈ పేరును,  సినిమాలోని ఎమోషన్ల ఆధారంగా ఎన్నికల ప్రచారం కోసం యాడ్స్ రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి.  ప్రత్యక్షంగా ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేయడంతో పాటు సోషల్ మీడియాలో కూడా  గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. ఇక పలు రకాల యాడ్స్ తో పార్టీలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ కూడా బలగం సినిమా థీమ్ తో యాడ్స్ రూపొందించింది. ఈ యాడ్స్ ప్రజలను  ఆకట్టుకోవడమే కాకుండా ఆలోచింపజేస్తున్నాయి. శనివారం విడుదలైన ఈ ప్రకటనలు పలు సోషల్‌ మీడియా ఫుల్ వైరల్‌గా మారాయి. బలగం మూవీ నేపథ్యంలో ఐద్ యాడ్స్ ను బీఆర్ఎస్ పార్టీ రూపొందించింది.  ఈ ఐదు యాడ్లలను సినిమా థియేటర్లలో, టీవీల్లో ప్రదర్శించేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నాయి.

ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘బలగం’ సినిమా సంచలనం సృష్టించింది. తెలంగాణ జీవన విధానాన్ని ప్రతిబింబిస్తూ రూపొందించారు. ఈ చిత్రం.. ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొని అపూర్వ విజయాన్ని అందుకున్నది. గ్రామగ్రామాన ప్రొజెక్టర్లు, స్రీన్ల మీద ప్రదర్శించిన ఈ చిత్రానికి అన్నివర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అందుకే  ఈసినిమాను థీమ్ ను పలు కంపెనీలు కూడా తమ వస్తువల ప్రమోషన్లకు వాడుకున్నాయి. తాజాగా ఎన్నికల్లోనూ బలగం  సినిమా తన ముద్రను వేసింది.

 ఇప్పటికే ఎన్నికల ప్రచారం దూసుకెళ్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ..టాలీవుడ్ లో ఘన విజయం సాధించిన ‘బలగం’ సినిమా థీమ్‌తో ఈ యాడ్స్‌కు నిర్మించింది. ప్రస్తుతం వీటికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. ఈ యాడ్స్ బలంగ మూవీలో ప్రధాన పాత్ర అయిన కొమురయ్యతో పాటు ఇతర ముఖ్యపాత్రలు కూడా కనిపిస్తాయి. అంతేకాక.. సినిమాలోని పలు సన్నివేశాలను తీసుకుని తెలంగాణ అభివృద్ధి, కేసీఆర్ సాధించిన విజయాలను, అందిస్తున్న పథకాల గురించి వివరించేలా తెరకెక్కించారు. పదేళ్ల సీఎం కేసీఆర్‌ పాలనలో సాధించిన విజయాలను, పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను, అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించడం కోసం బీఆర్‌ఎస్‌ ఓటు వేయాల్సినట్లు ఈ షార్ట్ ఫిల్మ్ పొందుపర్చారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీరు వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom