Krishna Kowshik
మహేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అన్నాదమ్ములు. వారసత్వంగా ఏడు ఎకరాల భూమి వస్తే.. అన్నకు చెప్పకుండా తమ్ముడు ఆ ఆస్థిని కాజేశాడు. ఈ విషయం సోదరుడికి తెలియడంతో నిలదీశాడు. కానీ చివరకు
మహేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అన్నాదమ్ములు. వారసత్వంగా ఏడు ఎకరాల భూమి వస్తే.. అన్నకు చెప్పకుండా తమ్ముడు ఆ ఆస్థిని కాజేశాడు. ఈ విషయం సోదరుడికి తెలియడంతో నిలదీశాడు. కానీ చివరకు
Krishna Kowshik
రామ లక్ష్మణుల్లా కలిసి ఉండాల్సిన అన్నాదమ్ములు.. ఆస్థి విషయంలో కోట్లాడుకుంటున్నారు. చిన్నప్పటి నుండి కలిసి మెలిసి తిరిగి, ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకుని, కష్ట నష్టాల్లో తోడుగా ఉన్న సోదరులు.. పెళ్లయ్యాక పూర్తిగా స్వార్థంగా బతుకుతున్నారు. అన్న ఆస్థి కాజేయాలని తమ్ముడు.. తమ్ముడుకు ఏ సొత్తు దక్కకూడదని అన్న ఆలోచిస్తూ బద్ధ శత్రువులుగా మరిపోయారు. వంశపారపర్యంగా వస్తున్న ఆస్థిని కాజేశాడని మనస్థాపంతో అన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో బంధువులు అన్న మృతదేహాన్ని తమ్ముడి ఇంటికి తీసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంత సాగర్ గ్రామంలో చోటుచేసుకుంది. అధికారుల జోక్యంతో చివరకు అంత్యక్రియలు నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే.. బండ శ్రీనివాస రెడ్డి, సరోజన దంపతులకు మహేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాగా, వీరికి వంశపారపర్యంగా వస్తున్న ఏడు ఎకరాల భూమి చెరో సగం పంచుకోవాల్సి ఉంది. అయితే అన్నకు ఇవ్వాల్సిన 3 ఎకరాల 20 గుంటల భూమిని కూడా తమ్ముడైన ప్రభాకర్ రెడ్డి 2018లో తన భార్య జ్యోతి, సాయినాథ్ పేరున పట్టా చేశాడు. తన భూమిని కూడా తమ్ముడు స్వాధీనం చేసుకున్నాడని తెలిసి నిలదీశాడు. దీని మీద అన్నాదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీని మీద ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. పంచాయతీ కూడా నిర్వహించారు. కానీ విషయం తేలలేదు. సర్పంచ్, ఉప సర్పంచ్‌ను కోరగా..తాము అడిగినంత ఇస్తేనే మీ తమ్ముడితో మాట్లాడి సెటిల్ చేస్తామని పేర్కొన్నారు.
దీంతో అయినవారే.. తెలిసిన వాళ్లే మోసం చేశాడని మనస్థాపానికి గురైన మహేందర్..ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స పొందుతూ అతడు మరణించాడు. దీంతో మహేందర్ రెడ్డి మరణానికి ప్రభాకర్ రెడ్డి.. సర్పంచ్, ఉప సర్పంచే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసింది మహేందర్ రెడ్డి భార్య. అనంతరం మృతదేహాన్ని ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు కుటుంబ సభ్యులు. విషయం తెలిసి పోలీసులు రాగా, తమ భూమి తమకు ఇవ్వకపోతే.. ఆందోళన విరమించమని, దహన సంస్కారాలు చేయమని తేల్చి చెప్పారు. అలా శుక్రవారం నుండి ఆదివారం సాయంత్రం వరకు ఆ గ్రామంలో ఆందోళన కొనసాగింది.
పెద్ద ఎత్తున పోలీసులు మోమరించారు. అయితే ఉన్నతాధికారుల నుండి పోలీసులపై ఒత్తిడి పెరగడంతో.. కొంత మంది పెద్ద మనుషులతో కలిసి.. చర్చలు జరిపారు. చివరకు మహేందర్ రెడ్డి కుటుంబ న్యాయం జరిగేలా చూస్తామని తెల్ల కాగితం రాసి సంతకాలు చేశారు. దీంతో ఆందోళన విరమించి.. సోమవారం ఉదయం మహేందర్ రెడ్డి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే.. మహేందర్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన ప్రభాకర్ రెడ్డి..కుటుంబ సభ్యులో కలిసి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.