Krishna Kowshik
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుబి మోగిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకెళుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన నియోజకవర్గం కామారెడ్డి. ఈ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుబి మోగిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకెళుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన నియోజకవర్గం కామారెడ్డి. ఈ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Krishna Kowshik
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తుది దిశకు చేరుకున్నాయి. కాంగ్రెస్ ప్రభంజనం సృష్టిస్తోంది. హ్యాట్రిక్ హిట్ కొడతామనుకున్నా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయి. ఈ సారి తమదే గెలుపుకు అనుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపారు ఓటర్లు. ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులపై భారీ మెజార్టీతో గెలుపొందారు కాంగ్రెస్ క్యాండిడేట్స్. పది సంవత్సరాల కేసీఆర్ పాలనకు స్వస్థి పలికారు. కాంగ్రెస్‌కు పట్టం కడుతున్నారు. నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి కీలక నేతలు ఓటమి చెందారు. ఇప్పుడు మరో సంచలనం నెలకొంది.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి విజయం దిశగా దూసుకెళుతున్నారు. ఇదే నియోజక వర్గం నుండి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పోటీ చేశారు. వీరిద్దరిపై ఆధిక్యంలో ఉన్నారు రమణా రెడ్డి. ఇద్దరు రాజకీయ ఉద్దండులపై పోటీ చేసి సత్తా చాటారు. రేవంత్ రెడ్డి రెండవ స్థానంలో ఉండగా.. కేసీఆర్ మూడవ స్థానానికి పరిమితమయ్యారు. ఈ ఫలితాలపై తొలి నుండి ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెర దింపుతూ కమలం నేత భారీ ఓట్లతో దూసుకెళుతున్నారు. వీరిద్దరి కన్నా కేసీఆర్ వెనుకబడటాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రేవంత్, కేసీఆర్ కామారెడ్డి కాకుండా మరో నియోజకవర్గంలో పోటీ చేశారు. రేవంత్ కొడంగల్‌లో విజయం సాధించగా, కేసీఆర్ గజ్వేల్ నుండి గెలుపొందారు.