Dharani
Ayodhya Ram Mandir: అయోధ్య వెళ్లి రాములోరిని దర్శించుకోవాలనుకునేవారికి శుభవార్త. వారి కోసం ఉచితంగా ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు ఓ నేత. ఆ వివరాలు..
Ayodhya Ram Mandir: అయోధ్య వెళ్లి రాములోరిని దర్శించుకోవాలనుకునేవారికి శుభవార్త. వారి కోసం ఉచితంగా ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు ఓ నేత. ఆ వివరాలు..
Dharani
దేశంలోని హిందువులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జనవరి 22, సోమవారం నాడు ఆవిష్కృతం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా.. ఈ కార్యక్రమం జరగనుంది. ఈ అద్భుత దృశాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు గాను దేశ, విదేశాల నుంచి ఎందరో భక్తులు తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ 8 వేల మందిని ఆహ్వానించింది. వీరిలో సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన వారు మాత్రమే కాక సాధువులు, పీఠాధిపతులను కూడా ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే భక్తులకు ఉచిత దర్శనం, ప్రసాదాలతో పాటు భోజన సదుపాయం కూడా కల్పించన్నట్లు తెలుస్తోంది.
అయితే.. అయోధ్య వెళ్లి.. భవ్య రామమందిరాన్ని దర్శించుకునేందుకు ఎంతో మంది భక్తులు తహతహలాడుతున్నారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిసిన తర్వాత.. కొన్ని రోజులకే సాధారణ భక్తులకు కూడా ఆలయ ప్రవేశం కల్పిస్తామని ఇప్పటికే అయోధ్య ఆలయ అధికారులు తెలిపారు. అయోధ్య రాములోరిని దర్శించకునేందుకు.. భక్తులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక కొందరైతే.. సైకిల్, బైక్ యాత్రలతో పాటు కాలినడకన కూడా అయోద్య నగరానికి పయనమయ్యారు. ఈ క్రమంలోనే.. అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. వారి కోసం ఉచిత రైలును ఏర్పాటు చేయనున్నారు నల్గొండ జిల్లాకు చెందిన ఓ బీజేపీ నేత.
నల్గొండ బీజేపీ ఇంఛార్జ్‌గా నియమితులైన నాగం వర్షిత్ రెడ్డి.. అయోధ్య వెళ్లాలనుకునే భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి కోసం నల్గొండ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలును బుక్ చేశారు. ఈ రైలులో దాదాపు 1400 మంది భక్తులను అయోధ్యకు తీసుకెళ్లనున్నారు. ఇందులో బీజేపీ పార్టీ కార్యకర్తలతో పాటు సామన్యులకు కూడా అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ రైలు ఫిబ్రవరి 4న నల్గొండ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవ్వనున్నట్లు తెలిసింది. త్వరలోనే పూర్తి సమాచారం వెల్లడిస్తామన్నారు.
అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో ప్రధాని మోదీ నల్గొండలో జరిగే సభకు విచ్చేయనున్నారు. అదే సమయంలో అయోధ్యకు ఫ్రీ రైలును బుక్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏది ఏమైనా.. భక్తుల కోసం పార్టీకి చెందిన నేత.. ఏకంగా రైలునే బుక్ చేయటాన్ని బీజేపీ నేతలు అభినందిస్తున్నారు. సామాన్యులు సైతం అతడి పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.