P Krishna
తెలుగు బుల్లితెర, వెండి తెరపై బిత్తిరి సత్తి గురించి కొత్త పరిచయం అక్కరలేదు.. తనదైన కామెడీ మార్క్ చాటుకుంటూ అందరినీ నవ్విస్తుంటాడు.
తెలుగు బుల్లితెర, వెండి తెరపై బిత్తిరి సత్తి గురించి కొత్త పరిచయం అక్కరలేదు.. తనదైన కామెడీ మార్క్ చాటుకుంటూ అందరినీ నవ్విస్తుంటాడు.
P Krishna
తెలంగాణ బుల్లితెరపై తనదైన మేనరీజంతో అందరినీ ఆకట్టున్నాడు బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ . సినిమాపై ఇష్టంతో ఎన్నో స్టూడియోలు తిరిగిన బిత్తిరి సత్తి ఓ ఛానల్ లో తన వెషం, భాష, మేనరీజం మొత్తం మార్చుకొని బిత్తిరి సత్తిగా తనదైన కామెడీ మార్క్ చాటుకున్నాడు. తర్వాత సినిమాల్లో ఛాన్సు దక్కించుకొని హీరోగా కూడా నటించి తన సత్తా చాటాడు. ఇటీవల బిత్తిరి సత్తి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బిత్తిరి సత్తి.. మంత్రి కేటీఆర్ ని కలిశారు. వివరాల్లోకి వెళితే..
బుల్లితెర, వెండితెరపై తనదై మార్క్ చాటుకొని అందరిని కడుపుబ్బా నవ్విస్తున్న బిత్తిరి సత్తి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. సినిమాల్లో హీరోగా నటించిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తున్నారు. పలు యూట్యూబ్ ఛానల్లో తన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. గురువారం బిత్తిరి సత్తి ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ని కలిశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బిత్తిరి సత్తి ఇటీవల ఆత్మగౌరవ సభలో తన స్పీచ్ తో దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ముదిరాజ్ ఆత్మగౌరవ సభలో బిత్తిరి సత్తి అధికార పార్టీపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. తెలంగాణలో అరవై లక్షల మంది ముదిరాజ్ లు ఉన్నారు.. కానీ బీఆర్ఎస్ 119 స్థానాల్లో ఒక్కటి కూడా ముదిరాజ్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో ముదిరాజ్ ఆ్మగౌరవ సభలు, ఆత్మీయ సభల పేరుతో ఊదరగొడుతున్నారు. ఇలాంటి సమయంలో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన బిత్తిరి సత్తి.. మంత్రి కేటీఆర్ తో భేటీ కావడంపై హాట్ టాపిక్ గా మారింది.