P Venkatesh
ఖమ్మంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తల్లితో సహా ఇద్దరు కూతుర్లు మృతి చెందడంతో మృతురాలి తండ్రి భర్తపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు.
ఖమ్మంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తల్లితో సహా ఇద్దరు కూతుర్లు మృతి చెందడంతో మృతురాలి తండ్రి భర్తపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు.
P Venkatesh
పచ్చని కాపురంలో అనుమానాలు పెనుభూతాలవుతున్నాయి. అదనపు కట్నం కోసం వేధింపులు, కుటుంభకలహాలు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఆర్థిక పరమైన సమస్యలు, ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించడం, ఈగోలకు పోవడం వంటి కారణాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమై కుటుంబాలను రోడ్డు పాలుచేస్తున్నాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో ఇదే రీతిలో ఓ ఘటన చోటుచేసుకుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కారు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నిన్న( మంగళ వారం) రాత్రి జరిగిన కారు ప్రమాదంలో తల్లితో సహా ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. అయితే ఈ ప్రమాదంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అది ప్రమాదం కాదని భార్యాబిడ్డలను వదిలించుకునేందుకు భర్త చేసిన దారుణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండా సమీపంలో మంగళవారం రాత్రి కారు ప్రమాదానికి గురైంది. బాబోజితండాకు చెందిన డా.బోడా ప్రవీణ్, తన భార్య కుమారి, కుమార్తెలు కృషిక, తనిష్కతో కలిసి కారులో మంచుకొండ నుంచి హర్యాతండాకు బయలుదేరారు. ఇలా వస్తున్న క్రమంలో కుక్క అడ్డురాగా దాన్ని తప్పించే క్రమంలో కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుమారితో పాటు ఆమె కుమార్తెలు.. కృషిక, తనిష్క మృతిచెందారు. కుమారి భర్త ప్రవీణ్ స్వల్పంగా గాయపడగా.. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంపై కుమారి తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుమారి, ఆమె పిల్లలను ప్రవీణే చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించడం హాట్ టాపిక్ గా మారింది.
వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్ అయిన ప్రవీణ్ కు 2017లో 2017లో ఏన్కూరు మండలం రంగాపురానికి చెందిన హరిసింగ్, పద్మ దంపతుల కూతురు కుమారితో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నంగా 24 లక్షలు ఇచ్చామని మృతురాలి తండ్రి హరిసింగ్ వెల్లడించారు. ఇద్దరు ఆడిపిల్లలే పుట్టడంతో తమ కూతురును వేధింపులకు గురిచేసేవాడని హరిసింగ్ తెలిపారు. ఈ క్రమంలో ప్రవీణ్ కేరళకు చెందిన యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు సంచలన ఆరోపణలు చేశాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య దాదాపు 10 నెలలుగా గొడవలు జరుగుతున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కారు ప్రమాదంలో తల్లితో సహా ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోవడం, పిల్లల శరీరంపై చిన్న గాయం కూడా లేకపోవడంతో బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు విచారణ చేసి ప్రవీణ్ ను కఠినంగా శిక్షించాలంటూ మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.