P Krishna
Fraud at Petrol Bunk: కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఎన్నో మోసం చేస్తున్నారు. ఓ పెట్రోల్ బంక్ నిర్వాహకుల ఘరానా మోసం వినియోగదారులను షాక్ కి గురయ్యేలా చేసింది.
Fraud at Petrol Bunk: కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఎన్నో మోసం చేస్తున్నారు. ఓ పెట్రోల్ బంక్ నిర్వాహకుల ఘరానా మోసం వినియోగదారులను షాక్ కి గురయ్యేలా చేసింది.
P Krishna
డబ్బు కోసం మనిషి దేనికైనా సిద్ద పడుతున్నాడు. ఎన్ని అక్రమాలకైనా తెగబడుతున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారు. అందుకోసం ఎదుటి వారిని దారుణంగా మోసం చేస్తూ ఈజీ మనీ సంపాదిస్తున్నారు. నిత్యావసర సరుకు పప్పులు, నూనె నుంచి మొదలు పెడితే.. వాహనాల్లో పోసే పెట్రోల్, డీజిల్ వరకు అన్నింటిలోనూ కల్తీ చేయడం, కొలతల్లో మోసం చేయడం ఇలా ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. ప్రజలు ఇలాంటి నిజాలు వెలుగులోకి తెస్తే అధికారులు తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ పెట్రోల్ బంక్ లో జరుగుతున్న దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
జడ్చర్ల పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలోని శ్రీనివాస థియేటర్ వద్ద ఉన్న ఓ పెట్రోల్ బంక్ లో ఘరానా మోసం వెలుగు లోకి వచ్చింది. వాహనదారులు ఈ విషయాన్ని తెలుసుకొని ఇన్నాళ్లు ఇంత దారుణంగా మోసపోతున్నామా అని నోళ్లు వెల్లబెట్టారు. అసలు విషయానికి వస్తే.. జడ్చర్ల మండలం గోపుల్లాపూర్ గ్రామానికి చెందిన అంజి అనే యువకుడు మార్గ మధ్యలో తన బండి ఆగిపోవడంతో పెట్రోల్ బంక్ కి వెళ్లి బాటిల్ లో లీటర్ పెట్రోల్ కొట్టమని డబ్బులు చెల్లించాడు. పెట్రోల్ బంక్ సిబ్బంది లీటర్ పెట్రోల్ కు మీటర్ ఫీడింగ్ చేయగా అందులో నుంచి మాత్రం అరలీటర్ మాత్రమే పెట్రోల్ రావడం చూసి అంజి షాక్ తిన్నాడు. తాను లీటర్ పెట్రోల్ కి డబ్బులు చెల్లించానని.. మీటర్ ఫీడింగ్ కూడా లీటర్ కే చేశారని.. రావడం మాత్రం అరలీటర్ వచ్చిందని సిబ్బందితో అన్నాడు.దానికి సిబ్బంది నువ్వు అరలీటర్ కే డబ్బులు ఇచ్చావని బుకాయించారు.
అప్పటికే అక్కడికి చేరుకున్న వాహనదారులు తాము అంతా చూశామని అంజికి మద్దతు తెలపడంతో చేసేదేమి లేక నిజం ఒప్పుకున్నారు. వాస్తవానికి పెట్రోల్ పోసే సమయంలో మీటర్ ఫీడింగ్ చేస్తుంటే కరెంట్ పోయి వచ్చిందని.. ఆన్ లైన్ లో పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారు. ఇదిలా ఉంటే వినియోగదారులు మాత్రం ఈ ఘటనపై ఫైర్ అవుతున్నారు. బంక్ యాజమాన్యం ఇదే పద్దతిలో తమను ఎప్పటి నుంచో మోసం చేస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాటీల్ తో ఈ బండారం బయట పడిందని అంటున్నారు. అర లీటర్ పెట్రోల్ పోసిందే కాకుండా నిలదీసినందుకు వినియోగదారుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విజిలెన్స్ సివిల్ సప్లై అధికారులు బంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత వారం రోజులుగా ఆన్ లైన్ డేటాను పరిశీలించి మోసానికి పాల్పపడిన బంక్ ని సీజ్ చేయాలని వియోగదారులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.