iDreamPost
android-app
ios-app

తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 12వ తేదీలోగా..!

TS DOST Phase III Registrations: ఇంటర్ విద్యార్థులు డిగ్రీలో చేరేందుకు ఆన్ లైన్ ప్రవేశాలకు సంబంధించిన 3వ విడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించిన కీలక అప్ డేట్ అధికారులు అందించారు.

TS DOST Phase III Registrations: ఇంటర్ విద్యార్థులు డిగ్రీలో చేరేందుకు ఆన్ లైన్ ప్రవేశాలకు సంబంధించిన 3వ విడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించిన కీలక అప్ డేట్ అధికారులు అందించారు.

తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 12వ తేదీలోగా..!

డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాలు ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. జులై 2 వ తేదీతో రిజిస్ట్రేషన గడువు పూర్తయ్యింది. అప్పటికీ దరఖాస్తులు పూర్తి స్థాయిలో రాకపోవడంతో గడువు తేది పొడిగించారు. మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గడువును జులై 4 వ తేదీ సాయంత్రం 5 గంల వరకు పాడిగిస్తున్నట్లు అధికారుల తెలిపారు. ఇంటర్నెట్ ఇబ్బందులు, సర్వర్ ఇబ్బందులు తదితర కారణాల వల్ల దరఖాస్తు చేయలేకపోయామని..  విద్యార్థుల విజ్ఞప్తి మేరకు మరో రెండు రోజులు గడువును పెంచినట్లు తెలిపారు.  ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాజాగా దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించి కీలక అప్ డేట్ చేశారు అధికారులు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాలకు అధికారులు కీలక అప్ డేట్ ఇచ్చారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే దరఖాస్తులు చేసుకునే గడువు ముగిసింది. నెట్ వర్క్ పనిచేయకపోవడం ఇతర కారణాల వల్ల  విద్యార్థుల విజ్ఞప్తి మేరకు మూడో దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గడువును జులై 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరుకు పొడగిస్తున్నట్లు అధికారు తెలిపారు. మూడవ విడత దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 4వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. దోస్త్ ద్వారా రాష్ట్రంలోని 1,066 డిగ్రీ కళాశాలల్లో మొత్తం 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దోస్త్ ప్రక్రియ ద్వారా ఈ సీట్లను భర్తీ చేస్తున్నారు. ఇప్పటి వరకు రెండు దశలు పూర్తయ్యాయి.. ప్రస్తుతం మూడో దశ ద్వారా మిగిలిన సీట్లను భర్తి చేయనున్నారు.

దోస్త్ 3 వ విడతలొ 73,662 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. అయితే వీరిలో 9,630 మంది సీట్లు మార్చుకొని మరో కాలేజ్ కి వెళ్లారు.. మొత్తంగా 3 విడతల్లో 1,54,246 మంది ప్రవేశాలు పొందారు. మూడో విడతలో సీట్లు పొందే విద్యార్థులు జులై 8 నుంచి 12 మధ్య రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని, లేదంటే సీటును కోల్పోతారని అధికారులు హెచ్చరిస్తున్నారు. అన్ని విడతలు పూర్తయితే స్పాట్ అడ్మిషన్ల కోసం ఉన్నత విద్యామండలి గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై అధికార్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి