పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ వరద.. చిక్కుకున్న 30 మంది!

Bhadradri Kothagudem District- 30 Members Stuck In Floods: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఈ వరద నీటిలో 30 మంది కూలీలు చిక్కుకున్నారు.

Bhadradri Kothagudem District- 30 Members Stuck In Floods: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఈ వరద నీటిలో 30 మంది కూలీలు చిక్కుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ వర్షాలకు రాష్ట్రంలో ఉన్న వాగులు పొంగి పొర్లుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలో వరద నీటిలో కూలీలు చిక్కుకున్నారు. వాళ్లు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. భారీగా వర్షాలు కురుస్తుండటంతో పెద్దవాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. భారీగా వరద నీరు వస్తుండటంతో.. అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తేశారు. గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతంలో వరద నీరు పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో నారాయణపురం వద్ద వరదనీటిలో ఏకంగా 30 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారికోసం సహాయకచర్యలు ప్రారంభించారు.

కూలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాలని మంత్రి తుమ్మల సూచించారు. అక్కడి పరిస్థితిని సీఎంవోకి వివరించిన మంత్రి తుమ్మల తగిన సహాయం కోరారు. హెలికాప్టర్ సాయంతో కూలీలను ఒడ్డుకు చేర్చాలని కోరారు. అందుకు తగినట్లుగా ఎన్డీఆర్ఎఫ్, సహాయక బృందాలకు మంత్రి తుమ్మల తగు సూచనలు చేశారు. మంత్రి సూచనల మేరకు రెస్క్యూ టీమ్స్ కూలీలను రక్షించేందుకు కృషి చేస్తున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచే ఈ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భద్రాచలం, చర్ల, బూర్గంపాడు, దుమ్ముగూడెం మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆ మండలాల్లో పరిస్థితులు చూస్తే.. పలుచోట్ల ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. వాహనాల రాకపోకలు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

చర్ల వద్ద రహదారి పైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 21 అడుగులకు చేరింది. అలాగే ప్రధాన రహదారులపైకి 3 అడుగుల మేర నీల్లు చేరాయి. దీంతో భద్రాచలం నుంచి చర్ల, వాజేడు, దుమ్ముగూడెం, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే రాష్ట్రంలో మరో మూడ్రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అంటే ఇంకా ఈ వర్షాలు ఇలాగే కురిసే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. వర్షం కురిసే సమయంలో బహిరంగ ప్రదేసాలు, పొలాలు, చెట్ల కిందకు వెళ్లకూడదని చెబుతున్నారు. వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Show comments