Arjun Suravaram
Barrelakka Sirisha: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క అలియాస్ శిరీషా పేరు మారుమోగిన విషయం తెలిసిందే. ప్రధాన పార్టీలతో పాటు బర్రెలక్కపై మీడియా ఫోకస్ చేసింది. తాజాగా ఆమె మిస్సింగ్ అంటూ టాక్ వినిపించింది. దీనిపై బర్రెలక్క క్లారిటీ ఇచ్చారు.
Barrelakka Sirisha: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క అలియాస్ శిరీషా పేరు మారుమోగిన విషయం తెలిసిందే. ప్రధాన పార్టీలతో పాటు బర్రెలక్కపై మీడియా ఫోకస్ చేసింది. తాజాగా ఆమె మిస్సింగ్ అంటూ టాక్ వినిపించింది. దీనిపై బర్రెలక్క క్లారిటీ ఇచ్చారు.
Arjun Suravaram
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. నెల రోజుల పాటు అన్ని పార్టీల నేతలు ప్రచారం బిజీబిజీగా గడిపారు. ఆదివారం వెలువడనున్న ఫలితాలతో ఎవరి భవితవ్యం ఏమిటనేది తేలనుంది. ఇక ఈ సారి జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం చాలా ప్రత్యేకంగా ఉంది. అందుకు కారణం.. స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క అలియాస్ శిరీషా అనే యువతి పోటీ చేయడమే. ఆమె ప్రధాన పార్టీలకు గట్టి పోటీనే ఇచ్చారు. ఆమె గెలుపు అవకాశాలు పక్కన పెడితే.. గట్టి పోటీ అయితే ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. తాజాగా పోలింగ్ తరువాత బర్రెలక్క మిస్సింగ్ అంటూ వార్తలు వచ్చాయి. ఆ రూమర్స్ పై బర్రెలక్క క్లారిటీ ఇచ్చారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం….
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక్లలో ఈసారి ప్రధాన అభ్యర్థులతో పాటు బర్రెలక్క అలియాస్ శిరీషా కూడా మీడియా అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంది. ఎంత చదివినా ఉద్యోగాలు రావటం లేదంటూ ఆమె చేసిన ఓ వీడియో వైరల్ కావటంతో బర్రెలక్క ఫేమస్ అయ్యారు. నిరుద్యోగుల గొంతుకగా ఆమె.. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. నవంబర్ 30న పోలింగ్ ముగియగా.. రేపు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికల ముగిసిన మరుసటి రోజు నుంచి బర్రెలక్క కనిపించలేదు.
అంతేకాక ఆమె ఫోన్ కాల్ లోనూ అందుబాటులోకి రాలేదు. దీంతో బర్రెలక్క అజ్ఞాతంలోకి వెళ్లారని, ఆమె మిస్సైందంటూ టాక్ వినిపించింది. ఆమెకు గెలుపు అవకాశాలు ఉండటంతో పలు పార్టీల నేతలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ పొలిటకల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. ఇది ఇలా ఉండగా.. తనపై వస్తున్న ప్రచారాలపై బర్రెలక్క క్లారిటీ ఇచ్చారు. ఆమె ఎక్కడ ఉందో, ఎందుకోసం కనిపించకుండా పోయిందో తెలిసింది.
తన ఫ్రెండ్ కు ప్రమాదం కావడంతో వరంగల్ వెళ్లినట్లు బర్రెలక్క ఓ ఫోన్ కాల్ లో వెల్లడించారు. తన బెస్ట్ ఫ్రెండ్ ప్రమాదానికి గురి కావడంతో అత్యవసరంగా వరంగల్ వెళ్లాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. హాస్పిటల్ లో ఉండటం వల్లే లిఫ్ట్ చేయలేకపోతున్నానని ఆమె చెప్పారు. తాను మిస్సైనట్లు అయ్యానన్న వార్తలు అవాస్తమని పేర్కొన్నారు. నిజంగా తాను కనిపించకుండా పోతే.. తన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చేవారని తెలిపింది. తాను ఎక్కడికి వెళ్లలేదని..కావాలనే కొందరు తనపై దుష్ప్రాచారం చేస్తున్నారని తెలిపారు. ఇక తనకు ఏ రాజకీయ పార్టీల నుంచి ఆఫర్స్ రాలేదని కూడా చెప్పారు. తనకే గెలుపు అవకాశాలు ఉన్నాయని.. తాను ఖచ్చితంగా విజయం సాధిస్తానని తెలిపారు.
ఎన్నికల సమయంలో ఎంతో మంది తనకు సాయం చేశారని చెప్పుకొచ్చింది. ఎన్నికల ఖర్చుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పంపించిన విరాళాలు వివరాలు కూడా వెల్లడించారు. ఇప్పటి వరకు ఎన్నికల ఖర్చుల కోసం రూ.10 లక్షలు వచ్చినట్లు చెప్పారు. ఇక ఆ ఖర్చులకు సంబంధించిన బ్యాంకు స్టేట్ మెంట్ కూడా ఉందని, ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తరువాత మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. మరి.. బర్రెలక్క మిస్సింగ్ అంటూ వచ్చిన వార్తలపై ఆమె ఇచ్చిన కార్లీటిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.