iDreamPost
android-app
ios-app

MPగా పోటీ చేసి.. దారుణంగా ఓడిన బర్రెలక్క! నోటా కన్నా తక్కువ ఓట్లు!

  • Published Jun 05, 2024 | 5:16 PM Updated Updated Jun 05, 2024 | 5:31 PM

Barrelakka, Election Results 2024, Nagarkurnool: నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్క ఓటమి పాలైంది. అయితే.. ఆమెకు ఎన్ని ఓట్లు పడ్డాయి? ఏ స్థానంలో నిలిచిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Barrelakka, Election Results 2024, Nagarkurnool: నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్క ఓటమి పాలైంది. అయితే.. ఆమెకు ఎన్ని ఓట్లు పడ్డాయి? ఏ స్థానంలో నిలిచిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Jun 05, 2024 | 5:16 PMUpdated Jun 05, 2024 | 5:31 PM
MPగా పోటీ చేసి.. దారుణంగా ఓడిన బర్రెలక్క! నోటా కన్నా తక్కువ ఓట్లు!

గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష.. లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసిన విషయం తెలిసిందే. నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్కకు ఎన్ని ఓట్లు పడ్డాయనే విషయంపై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో చూపినంత ప్రభావం ఆమె ఎంపీ ఎన్నికల్లో చూపలేకపోయింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా 5754 ఓట్లు సాధించిన బర్రెలక్క.. ఎంపీ అభ్యర్థిగా మాత్రం కేవలం 3087 ఓట్లు సాధించింది. మొత్తం పోలైన ఓట్లలో ఆమెకు 0.25 శాతం ఓట్లు పడ్డాయి. మొత్తంగా 12వ స్థానంలో నిలిచింది. నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్లు రవి గెలుపొందారు.

నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ ఫైట్‌ జరిగింది. మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్లు రవి 94,414 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికలో బర్రెలక్క ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. నోటా కంటే ఆమెకు తక్కువ ఓట్లు రావడం గమనార్హం. నోటాకు 4, 580 ఓట్లు రాగా, బర్రెలక్కకు 3, 087 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ, బర్రెలక్కకు పోస్టల్‌ బ్యాలెట్‌లో 50 ఓవర్లు రావడం విశేషం. ప్రభుత్వ ఉద్యోగులు 50 మంది ఆమెకు మద్దతుగా నిలబడినట్లే లెక్క. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీలో ఉండి ప్రచారం చేసిన సమయంలో ఆమెపై దాడి కూడా జరిగింది. కానీ, ఆమె ఆశించిన ఫలితం మాత్రం రాలేదు.

సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేసుకుంటూ.. ఒకసారి నిరుద్యోగ సమస్యను లెవనెత్తి బర్రెలక్కకు శిరీష వైరల్‌ అయిన విషయం తెలిసిందే. సోషల్‌ మీడియా ద్వారా వచ్చిన ఫాలోయింగ్‌ను నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు ఎన్నికల బరిలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి వెక్కిరించాన.. వెనకడుగు వేయకుండా లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేయడంపై బర్రెలక్కను చాలా మంది ప్రశంసించారు. ఆమెకు వచ్చిన ఓట్లు తక్కువే కావొచ్చు కానీ, ఆమె ధైర్యాన్ని అంతా మెచుకోవాల్సిందే అంటూ సోషల్‌ మీడియాలో శిరీషకు మద్దతు లభిస్తుంది. ఒక సామాన్య యువతి ఇంత ధైర్యంగా ఎన్నికల బరిలో నిలుస్తూ నలుగురికి స్ఫూర్తినిస్తుందని నెటిజన్లు అంటున్నారు. మరి లోక్‌సభ ఎన్నికల్లో బర్రెలక్కకు వచ్చిన ఓట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.