iDreamPost
android-app
ios-app

Barrelakka: లోక్ సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. ఏ సింబల్‌ ఇచ్చారంటే

ఎన్ని డిగ్రీలు చదివినా ఉద్యోగాలు రావట్లేదు ఫ్రెండ్స్.. అందుకే బర్రెలు కాసుకుంటున్నా అన్న ఒక్క వీడియో ఓవర్ నైట్ సోషల్ మీడియా స్టార్ అయ్యింది బర్రెలక్క అలియాస్ శిరీష. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఆమెకు ఏం సింబల్ కేటాయించారంటే..?

ఎన్ని డిగ్రీలు చదివినా ఉద్యోగాలు రావట్లేదు ఫ్రెండ్స్.. అందుకే బర్రెలు కాసుకుంటున్నా అన్న ఒక్క వీడియో ఓవర్ నైట్ సోషల్ మీడియా స్టార్ అయ్యింది బర్రెలక్క అలియాస్ శిరీష. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఆమెకు ఏం సింబల్ కేటాయించారంటే..?

Barrelakka: లోక్ సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. ఏ సింబల్‌ ఇచ్చారంటే

ఎన్నికలంటే వివిధ పార్టీలకు చెందిన నేతలే అభ్యర్థులుగా నిలబడాల్సిన అవసరం లేదు.. రాజకీయ పార్టీలపై కడుపు మండిన సామాన్యులు సైతం పోటీ చేయొచ్చని నిరూపిస్తోంది బర్రెలక్క అలియాస్ శిరీష. నిరుద్యోగ సమస్యను ఏకరువు పెడుతూ గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి చర్చనీయాంశమైంది ఈ సోషల్ మీడియా స్టార్. యువత గొంతుకగా మారి కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసింది. ప్రచారంలో ఒడిదుడుకులు ఎదురైనా, సోదరుడిపై దాడి చేసి భయపెట్టినా..వెనక్కు తగ్గలేదు. అప్పటి నుండే మరింత ఉధృతంగా ప్రచారాన్ని కొనసాగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు ప్రతికూల ఫలితాలు వచ్చినా కుంగిపోలేదు.

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని బర్రెలక్క ప్రకటించి.. మరోసారి సెన్సేషనల్ అయ్యింది. అంతలో ఆమె పెళ్లి హడావుడిలో మునిగి తేలిపోయింది. వెంకటేశ్ అనే వ్యక్తిని మనువాడింది. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బిజీగా మారిపోయింది. అయితే లోక్ సభ ఎన్నికల్లో శిరీష ఇక పోటీ చేయదని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. తొలుత మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి బరిలోకి దిగుదామని భావించినప్పటికీ.. కానీ నాగర్ కర్నూల్ ప్రాంతంపై కాస్త పట్టు ఉండటంతో అక్కడి నుండి పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఇటీవల నామినేషన్ దాఖలు చేసింది.

కాగా, తాజాగా తనకు కేటాయించిన ఎన్నికల గుర్తుపై ప్రకటన చేసింది బర్రెలక్క. తనకు కేటాయించిన సింబల్ పై ఉబ్బితబ్బిబ్బు అయిపోతూ వీడియోను షేర్ చేసింది. ఇందులో శిరీష ఏమందంటే.. ‘నాగర్ కర్నూల్ నుండి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్న విషయం మీకు తెలుసు. చాలా మంది అక్క సింబల్ ఏం వచ్చింది అని అడుగుతున్నారు. చివరకు నేను ఎక్స్ పర్ట్ చేయని సింబల్ నాకు వచ్చింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నా స్మైల్‌ను బట్టి మీకు అర్థం అవుతూ ఉందనుకుంటా. నా లైఫ్ టర్న్ చేసిన గుర్తు వచ్చింది. విజిల్ సింబల్ కేటాయించింది ఈసీ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో దుమ్ములేపేసిన సింబల్ ఇది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దుమ్ము లేపేలా ఆశీర్వదించండి. ధాంక్యూ సో మచ్’ అంటూ చెప్పుకొచ్చింది బర్రెలక్క. కాాగా, ఆమెకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ గుర్తునే కేటాయించిన సంగతి విదితమే. ఇప్పుడు అదే సింబల్ రావడంతో ఆనందంలో వీడియోను షేర్ చేసుకుంది శిరీష.

 

View this post on Instagram

 

A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka)