iDreamPost
android-app
ios-app

గతేడాదిని దాటిన బాలాపూర్ లడ్డు.. ఈ ఏడాది ఎంతంటే?

గతేడాదిని దాటిన బాలాపూర్ లడ్డు.. ఈ ఏడాది ఎంతంటే?

బాలాపూర్ లడ్డుకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దీనికి ఎంతగానో ప్రాముఖ్యత ఉంది. 9 రోజుల పాటు పూజలు అందుకొంటున్న ఈ మహా ప్రసాదంను దక్కించుకునేందుకు 30 ఏళ్ల నుంచి ఔత్సాహికులు పోటీ పడుతూనే ఉన్నారు. అయితే మొత్తానికి బాలాపూర్ లడ్డు వేలం ఈ ఏడాది రికార్డ్ ధర పలికింది. గతేడాది కంటే అదనంగా రూ.2 లక్షలు పలికి రికార్డ్ సృష్టించింది. రూ.27 లక్షలకు గాను ఈ ఏడాది దాసరి దాయానంద్ రెడ్డి బాలాపూర్ లడ్డును వేలంలో దక్కించుకున్నారు.

బాలాపూర్ ఉత్సవ కమిటి ఆయనను సన్మానించి లడ్డును ఆయనకు అందజేశారు. కాగా ముందుగా ఈ వేలంలో దాదాపు 36 మంది ఔత్సాహికులు పోటీ పడ్డారు. ఇకపోతే గతేడాది బాలాపూర్ లడ్డును వంగేటి లక్ష్మారెడ్డి రూ.24 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. మరో విషయం ఏంటంటే? బాలాపూర్ లడ్డు చరిత్రలోనే ఇదే ప్రాంతానికి చెందిన కొలన్ కుటుంబ కుటుంబ సభ్యులు ఏకంగా 9 సార్లు వేలంలో పాల్గొని లడ్డును దక్కించుకోవడం విశేషం. ఈ కుటుంబ సభ్యులు ఈ లడ్డును దక్కించుకోవడానిక ప్రతీ ఏడాది లడ్డు వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

బాలాపూర్ లడ్డు చరిత్ర:

1994 నుంచి 2023 వరకు.. అంటే దాదాపుగా బాలాపూర్ లడ్డుకు 30 ఏళ్ల చరిత్ర ఉండడం విశేషం. ఈ లడ్డును అప్పటి నుంచి ఎవరెవరు దక్కించుకున్నారంటే?

1994లో కొలన్ మోహన్ రెడ్డి రూ. 450
1995 లో కొలన్ మోహన్ రెడ్డి రూ. 4500
1996 లో కొలన్ మోహన్ రెడ్డి రూ. 18 వేలు
1997లో ఇతరులు రూ.28 వేలు
1998లో కొలన్ మోహన్ రెడ్డి రూ. 51 వేలు
1999 కల్లెం ప్రతాప్ రెడ్డి రూ.65 వేలు
2000లో కల్లెం అంజి రెడ్డి రూ.66 వేలు
2001లో రఘునందన్ చారి రూ.85 వేలు
2002లో కందాడ మాధవరెడ్డి రూ.లక్షా 5 వేలు
2003లో చిగురింత తిరుపతి రెడ్డి రూ.లక్షా 55 వేలు
2004లో కొలన్ మోహన్ రెడ్డి రూ. 2 లక్షలు
2005లో ఇబ్రహీం శేఖర్ రూ.2 లక్షల 8 వేలు
2006లో చిగురంత తిరుపతి రెడ్డి రూ.3 లక్షలు
2007లో జి. రఘునంన్ చారి రూ.4 లక్షల 15 వేలు
2013లో మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డి రూ.9 లక్షల 26 వేలు
2022లో వంగేటి లక్ష్మారెడ్డి రూ.24 లక్షల 60 వేలు
ఈ ఏడాది మాత్రం దాసరి దయానంద్ రెడ్డి రూ.27 లక్షలకు లడ్డును కైవసం చేసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి