iDreamPost

శంషాబాద్ విమానాశ్రయంలో అందుబాటులోకి ఆ సేవలు ప్రారంభం!

Hyderabad Airport: హైదరాబాద్ నగరంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిత్యం అనేక విమానా సర్వీసులు నడుస్తున్నాయి. ఈక్రమంలోనే ఈ ఎయిర్ పోర్టులో అనేక రకాల సేవలను ప్రయాణికులకు అందిస్తున్నారు. తాజాగా మరో సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Hyderabad Airport: హైదరాబాద్ నగరంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిత్యం అనేక విమానా సర్వీసులు నడుస్తున్నాయి. ఈక్రమంలోనే ఈ ఎయిర్ పోర్టులో అనేక రకాల సేవలను ప్రయాణికులకు అందిస్తున్నారు. తాజాగా మరో సేవలు అందుబాటులోకి రానున్నాయి.

శంషాబాద్ విమానాశ్రయంలో అందుబాటులోకి ఆ సేవలు ప్రారంభం!

నేటికాలంలో ఎక్కువ మంది విమాన సేవలను వినియోగించుకుంటున్నారు. ఇటీవల ఫ్లైట్ లో జర్నీ చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. అందుకే దేశంలోనే చాలా ప్రాంతాల్లో అంతర్జాతీయ విమానాశ్రాయాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ ఎయిర్ పోర్టులు ప్రయాణికులకు అనేక సేవలను అందిస్తుంటాయి. ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఎప్పటికప్పుడు కొత్త సర్వీస్ లను ప్రయాణికులకు అందిస్తుంటారు. తాజాగా హైదరాబాద్ విమానాశ్రయంలో కొత్త సేవలు  ప్రారంభమయ్యాయి. మరి.. ఆ సేవలు ఏమిటి, వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రెండు తెలుగు రాష్ట్రాల్లో శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేక స్థానం ఉంది.  హైదరాబాద్ నగరంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిత్యం అనేక ఫ్లైట్ సర్వీస్ నడుస్తున్నాయి. ఇక్కడి నుంచి వివిధ దేశాలకు విమానా సర్వీస్ లు ఉన్నాయి. నిత్యం ఇక్కడి నుంచి పెద్ద సంఖ్యలో జర్నీలు జరుగుతుంటాయి. ఇక ఈ ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు అనేక రకాల సౌకర్యాలు అందిస్తున్నారు. అంతేకాక మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో తరచూ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే పలు ప్రైవేటు కంపెనీలు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు వివిధ రకాల సర్వీస్ లను అందిస్తున్నాయి.

తాజాగా మరో ప్రైవేటు సంస్థ కూడా  కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఎక్సెస్ బ్యాగేజీ ప్రొవైడర్​ అవాన్ ఎక్సెస్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టులో తన సర్వీస్ లను ప్రారంభించినట్లు ప్రకటించింది. తక్కువ ఖర్చుతో కూడిన బ్యాగేజ్, ప్యాకేజ్ డెలివరీ సేవలని అందిస్తామని తెలిపింది. ఇక ఈ సేవలకు సంబంధించి.. అవాన్ ఎక్సెస్ సీఈఓ మీరా సింగ్ కీలక విషయాలను ప్రకటించారు. తమ సేవల వల్ల ప్యాసింజర్లతో పాటు పిల్లలతో గడిపే లేడీస్, సీనియర్ సిటిజన్లు, వికలాంగ ప్రయాణీకులకు ప్రయోజనం కలుగుతుందని సీఈఓ మీరా సింగ్ తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రయాణికుల రద్దీ బాగా పెరిగిన సంగతి తెలిసింది. ఇక రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి అనేక అవార్డులు వచ్చాయి. ఇక్కడ అందే సేవలపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలోనే  మరో సేవను అవాన్ ఎక్సైస్  ఈ విమానాశ్రయంలో అందుబాటులోకి తీసుకొచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి