iDreamPost
android-app
ios-app

కానిస్టేబుల్ అయ్యుండి ఇదేం పని.. మంత్రాలు చేస్తున్నాడని కన్న తండ్రిపై దాడి

కానిస్టేబుల్ గా ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సింది పోయి కన్నతండ్రిపై దాడికి పాల్పడ్డాడు. మరీ దారుణమైన విషయం ఏంటంటే తండ్రి తనపై మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో దాడి చేయడం అతడి మూర్ఖత్వానికి పరాకాష్టగా మారింది.

కానిస్టేబుల్ గా ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సింది పోయి కన్నతండ్రిపై దాడికి పాల్పడ్డాడు. మరీ దారుణమైన విషయం ఏంటంటే తండ్రి తనపై మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో దాడి చేయడం అతడి మూర్ఖత్వానికి పరాకాష్టగా మారింది.

కానిస్టేబుల్ అయ్యుండి ఇదేం పని.. మంత్రాలు చేస్తున్నాడని కన్న తండ్రిపై దాడి

ప్రపంచం ఓ వైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తుంటే.. మరో వైపు మూఢనమ్మకాలు మాత్రం సమాజాన్ని వదలడం లేదు. కొందరు మూర్ఖులు జాతకాల పేరిట, మంత్రాల నెపంతో దారుణాలకు మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఒకప్పుడు మూఢనమ్మకాలపై అవగాహన లేకపోవడంతో ప్రజలంతా వీటిని నమ్మేవారు. కానీ నేటి నాగరిక సమాజంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు, జన విజ్ఞాన వేదికలు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడంతో వీటి ప్రభావం తగ్గింది. కాగా మూఢనమ్మకాలను చదువుకున్న వారు కూడా నమ్మడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ తన తండ్రి మంత్రాలు చేస్తున్నాడని అనుమానం పెంచుకుని అతడిపై దాడి చేసి గాయపరిచాడు.
ఈ ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది.

చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది. అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానాన్ని అందిస్తుంది. మరి ఇలా గొప్ప గొప్ప చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ మూర్ఖంగా ఆలోచించాడు. అజ్ఞానంతో కళ్లు మూసుకుపోయాయి కన్నతండ్రిపై దాడికి పాల్పడ్డాడు. సమాజంలో జరుగుతున్న మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయాల్సిన కానిస్టేబుల్ మూఢనమ్మకాలను నమ్మాడు. కానిస్టేబుల్ అయ్యుండి మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో సొంత తండ్రిపై దాడి చేసి గాయపరిచాడు. ఈ అమానవీయ ఘటన నిజామాబాద్ జిల్లా ధర్‌పల్లి మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఎన్టీఆర్ నగర్‌కు చెందిన బుచ్చన్న కొడుకు రాజేందర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కొంత కాలం నుంచి తనపై తండ్రి మంత్రాలు చేస్తున్నాడని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ రాజేందర్ కన్న తండ్రి బుచ్చన్నపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కుటుంబ సభ్యులు అడ్డుకొని క్షతగాత్రుడిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కన్న తండ్రి అని చూడకుండా కానిస్టేబుల్ రాజేందర్‌ తండ్రిపై దాడి చేసిన ఘటనపై కుటుంబ భ్యులు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కాగా నిందితుడు ప్రస్తుతం భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.