లోయలో పడిన ఆర్మీ వాహన ఘటన.. తెలంగాణకు చెందిన జవాన్ మృతి

  • Author Soma Sekhar Published - 09:57 AM, Mon - 21 August 23
  • Author Soma Sekhar Published - 09:57 AM, Mon - 21 August 23
లోయలో పడిన ఆర్మీ వాహన ఘటన.. తెలంగాణకు చెందిన జవాన్ మృతి

లడఖ్ లో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది సైనికులు అమరులు అయిన విషయం తెలిసిందే. వీరిలో తెలంగాణకు చెందిన ఓ జవాన్ ఉండటం బాధాకరమైన విషయం. శనివారం ఆర్మీ జవాన్లతో వెళ్తున్న ఓ వాహనం లడఖ్ లోని లేహ్ జిల్లాలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనతో అందరు షాక్ కు గురైయ్యారు. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన 30 ఏళ్ల సైనికుడు నీరటి చంద్రశేఖర్ అమరుడైయ్యాడు. ఈ విషయం తెలియడంతో అతడి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు.

లడఖ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన జవాన్ నీరటి చంద్రశేఖర్ మరణించాడు. ఆర్మీ జవాన్లతో వెళ్తున్న ఓ వాహనం లడఖ్ లోని లేహ్ జిల్లాలో లోయలో పడిపోయిన సంఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది జవాన్లు అమరలు కాగా.. వారిలో తెలంగాణకు చెందిన జవాన్ కూడా ఉన్నాడు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తిర్మన్ దేవులపల్లికి చెందిన నీరటి చంద్రశేఖర్ ఈ ఘటనలో మరణించాడు. ఈ వార్త తెలియగానే అతడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు.

కాగా.. 2011లో చంద్రశేఖర్ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అతడికి లాస్య అనే యువతితో వివాహం జరగ్గా.. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా.. మూడు నెలల క్రితమే సెలవులపై ఇంటికి వచ్చాడు చంద్రశేఖర్. ఇక సెలవులు ముగిశాక వెళ్తూ వెళ్తూ.. మళ్లీ కుమారుడిని స్కూల్ లో జాయిన్ చేసేందుకు వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా.. చంద్రశేఖర్ మృతదేహం సోమవారం వరకు గ్రామానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇదికూడా చదవండి: తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ అప్‌డేట్‌!

Show comments