TGSRTC: శ్రావణ మాసంలో పెళ్లిళ్ల కోసం RTC బస్ బుక్ చేసుకుంటే భారీ డిస్కౌంట్!

శ్రావణ మాసంలో పెళ్లిళ్ల కోసం RTC బస్ బుక్ చేసుకుంటే భారీ డిస్కౌంట్!

ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు విశేషమైన కృషి చేస్తుంది టీజీఎస్ఆర్టీసీ. పండుగ, ఇతర వేడుకల సమయంలో ముందుస్తుగా రిజర్వేషన్స్ చేసుకునే వాళ్లకు డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తుంది. అలాగే...

ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు విశేషమైన కృషి చేస్తుంది టీజీఎస్ఆర్టీసీ. పండుగ, ఇతర వేడుకల సమయంలో ముందుస్తుగా రిజర్వేషన్స్ చేసుకునే వాళ్లకు డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తుంది. అలాగే...

తెలంగాణలో ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఎండీ సజ్జనార్, డిపో మేనేజర్లు విశేషమైన కృషి చేస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మీ పథకంలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్రంలోని మహిళలు, యువతులు, విద్యార్థినులు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్న సంగతి విదితమే. మహిళల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడికి వెళ్లాలన్నా బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో రద్దీ నెలకొంది. అయినప్పటికీ మహిళలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో బస్సు సర్వీసులను పెంచారు. రద్దీగా ఉన్న రూట్లలో కొత్త బస్సులను కూడా తీసుకువచ్చారు. అలాగే పండుగ, పబ్బాల సమయంలో దూర భారాలు వెళ్లే సమయంలో ముందుస్తుగా రిజర్వేషన్లు చేసుకుంటే డిస్కౌంట్ వంటి ప్రకటనలు చేస్తున్నారు. కాగా, ఇప్పుడు సరికొత్త ఆఫర్ ప్రకటించారు ఓ డిపో మేనేజర్.

శ్రావణమాసం అంటే శుభకార్యాలు చోటుచేసుకునే నెల. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు జరుగుతుంటాయి. అయితే ఈ వేడుకకు దూర భారాల నుండి బంధువులు, చుట్టాలు రావాలంటే సమస్యతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. పెళ్లిళ్లకు, ఇతర కార్యక్రమాలకు ఆర్టీసీ బస్ బుక్ చేసుకుంటే డిస్కౌంట్ అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వాసులకు ప్రస్తుతం వర్తించనుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు ఆర్మూర్ డిపో మేనేజర్ పి రవికుమార్. పెళ్లిళ్లు, ఇతర వేడుకల కోసం బస్ బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి డిపాజిట్ లేకుండా బస్ బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇలా బస్ బుక్ చేసుకోవడం వల్ల సుఖవంతమైన ప్రయాణం చేయొచ్చు.

ఏప్రిల్, మే తర్వాత పెళ్లిళ్లకు సుమారు రెండు నెలల గ్యాప్ వచ్చింది. శ్రావణ మాసం రావడంతో  తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందళ్లు నెలకొన్నాయి. అలాగే  గృహ ప్రవేశాలు,  ఇతర వేడుకలు కూడా చేసుకుంటూ ఉంటారు.  అయితే కొన్ని సార్లు కుటుంబం మొత్తం దూర భారాలు ప్రయాణించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో హడావుడిగా జర్నీచేయాలంటే కాస్తంత శ్రమతో కూడుకున్నది. అయితే ఈ బస్ బుకింగ్ వల్ల ఆ శ్రమ తగ్గుతుంది. హాయిగా రాకపోకలు సాగించొచ్చు కూడా.

Show comments