iDreamPost
android-app
ios-app

తండ్రిని మించిన తనయ.. కూతురికి సెల్యూట్ చేసిన తండ్రి

  • Published Sep 12, 2024 | 10:08 AM Updated Updated Sep 12, 2024 | 10:08 AM

Hyderabad: ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తనకంటే పెద్ద హోదాను అందుకోవడం చూసి.. ఓ తండ్రి భావోద్వేగానికి గురయ్యాడు. అంతేకాకుండా.. గర్వంగా ఆమెను చూసి సెల్యూట్ కూడా చేశాడు.

Hyderabad: ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తనకంటే పెద్ద హోదాను అందుకోవడం చూసి.. ఓ తండ్రి భావోద్వేగానికి గురయ్యాడు. అంతేకాకుండా.. గర్వంగా ఆమెను చూసి సెల్యూట్ కూడా చేశాడు.

  • Published Sep 12, 2024 | 10:08 AMUpdated Sep 12, 2024 | 10:08 AM
తండ్రిని మించిన తనయ.. కూతురికి సెల్యూట్ చేసిన తండ్రి

ఏ తల్లిదండ్రులైనా.. పిల్లలకి ఆస్తులు, చదువును ఇవ్వగలరు కానీ, ప్రయోజకులనైతే చేయలేరు. ఎందుకంటే.. వారు గమ్యన్ని చూపించడం, ఉపదేశించడం వరకే వాళ్ల కర్తవ్యం. ఇక ఆ గమ్యన్ని చేరుకొని ప్రయోజకులు అవ్వాల్సిన బాధ్యత పిల్లల పైనే ఆధారపడి ఉంటుంది. మరీ, అలాంటి పిల్లలు జీవితంలో ప్రయోజకులైనప్పుడు ఆ తల్లిదండ్రుల ఆనందం కళ్లల్లో కనిపిస్తుంది. ఇన్నాళ్లుగా వారు పడిన కష్టనికి ప్రతిఫలం ఎదురుగా కనిపిస్తుంటే.. ఆ తల్లిదండ్రులకు ఎంత గర్వంగా ఉంటుందో మాటాల్లో చెప్పలేం. తాము పెంచిన బిడ్డలు తమకంటూ గొప్ప స్థాయిలో ఉన్నరంటే.. ఏ తల్లిదండ్రులకు అంతకన్నా మరో గొప్ప బహుమతి ఏదీ ఉండదు. తాజాగా ఓ తండ్రికి కూడా తన కూతురిని సాధించిన ఘనత చూసి ఎంతో గర్వపడ్డాడు. ఇంతకీ ఆ యువతి సాధించిన ఘనత ఏంటి ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తనకంటే పెద్ద హోదాను అందుకోవడంతో సెల్యూట్‌ చేస్తూ.. ఓ తండ్రి భావోద్వేగానికి లోనైన అరుదైన ఘటన ఎస్సై ట్రైనీ క్యాడెట్ల మూడో దీక్షాంత్‌ పరేడ్‌ వేదికైంది. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో జీ రాంచందర్‌రావు అనే వ్యక్తి ఏఆర్‌ ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, ఆయనకు సౌమ్య అనే కుమార్తె ఉంది.  అయితే తన కూతుర్ని భవిష్యత్తులో తనకంటూ పెద్ద హోదాలో చూడాలని రాంచందర్ రావు చిన్నప్పటి నుంచి కలలు కనేవాడు. ఇక అనుకున్నట్లుగానే తన కూతురు సౌమ్యను చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించాడు. అలా ఆయన పడిన కష్టనికి ప్రతిఫలం నేడు కళ్లముందు కనిపించింది.

తన కూతురు సౌమ్య.. ఎస్సైగా శిక్షణ పూర్తి చేసుకోవడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. నిన్న బుధవారం పరేడ్‌ పూర్తి చేసుకున్న అనంతరం తన కూతురు సౌమ్యకు గౌరవంగా ఆ రాంచందర్ రావు సెల్యూట్ చేశాడు. ముఖ్యంగా సౌమ్య బ్యాచ్‌లో టాప్‌-10లో చోటు సంపాదించడం, సీఎం రేవంత్‌రెడ్డి నుంచి ‘చీఫ్‌ మినిస్టర్స్‌ రివాల్వర్‌ బెస్ట్‌ అండ్‌ బెస్ట్‌ ఆల్‌ రౌండర్‌’ ‘హోం మినిస్టర్‌ బాటెన్‌ విత్‌ సిల్వర్‌ ఎండ్‌ ఫర్‌ బెస్ట్‌ ఇండోర్‌’ అవార్డులు అందుకోవడం చాలా గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే తనకు మొదటి సెల్యూట్ తండ్రి నుంచే దక్కడంతో ఏఆర్‌ ఎస్సై సౌమ్య భావోద్వేగానికి లోనయ్యారు. మరీ, తండ్రి పేరు నిలబెట్టి ఆయనతో మొదటి సెల్యూట్ చేయించుకున్న ఏఆర్‌ ఎస్సై సౌమ్య విజయగాథ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.