Mee Seva కేంద్రాల నిర్వహణ కోసం దరఖాస్తుల ఆహ్వానం.. ఇప్పుడే దరఖాస్తు చేయండి

మీరు మీసేవా సెంటర్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారా? మీ సేవా కేంద్రాల ఏర్పాటు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. మీ సేవా కేంద్రాల నిర్వహణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ప్రభుత్వం.

మీరు మీసేవా సెంటర్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారా? మీ సేవా కేంద్రాల ఏర్పాటు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. మీ సేవా కేంద్రాల నిర్వహణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ప్రభుత్వం.

మీ సేవా అనేది ఆన్ లైన్ సేవా కేంద్రం. మీ సేవా ద్వారా పౌరులు వారికి అవసరమైన సేవలను పొందేందుకు వీలుంది. అవసరమైన సర్టిఫికేట్లు, ఇంకా ఇతర రకాలైన సేవలు ఈ మీ సేవా ద్వారా సులభంగా పొందే అవకాశం ఏర్పడింది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు సేవలందడమేగాక పలువురికి ఉపాధి మార్గాలుగా మారాయి. చదువుకున్న నిరుద్యోగులు మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. తాజాగా తెలంగాణలోని ఆ జిల్లాలో మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన వారు డిసెంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

రాష్ట్రంలో మీ సేవా కేంద్రాలు అందుబాటులోకి రాకముందు ఏవైనా సర్టిఫికేట్స్ కావాలన్నా, ఇతర సేవలు పొందాలన్నా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. దీంతో ఎంతో సమయం, వృథా అయ్యేది. సర్టిఫికేట్ల జాప్యంతో ఒక్కోసారి అందాల్సిన ప్రయోజనాలు అందకుండా పోయేవి. దీంతో ప్రజలు అసహనానికి గురయ్యే వారు. కానీ మీ సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాక ఆ సమస్యలకు చెక్ పెట్టినట్లైంది. అయితే మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు అర్హులైన వారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. తాజాగా వికారాబాద్ జిల్లాలోని బోంరాస్ పేట, దుద్యాల మండల కేంద్రాల్లో మీ సేవా కేంద్రాల నిర్వహణకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటలలోపు తమ దరఖాస్తు ఫారాలను కలెక్టర్ కార్యాలయంలోని ఈ డిస్టిక్ మేనేజర్ కు అందజేయాలని తెలిపారు.

మీ సేవా కేంద్రాల ద్వారా బర్త్ సర్టిఫికెట్లు, ప్రాపర్టీ ట్యాక్స్‌, ట్రేడ్‌ లైసెన్స్‌ వంటి వాటికి దరఖాస్తు చేసుకోవచ్చు. కరెంట్‌ బిల్లులు చెల్లించవచ్చు. కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికేట్స్, అగ్రికల్చర్ ల్యాండ్ వాల్యూ అప్లికేషన్ తదితర రెవెన్యూ సేవల కోసం మీ సేవాల కేంద్రాలను ఉపయోగించుకోవచ్చు. ఈసీ తీసుకోవడం, సొసైటీ రిజిస్ట్రేషన్‌ లాంటి రిజిస్ట్రేషన్‌ శాఖకు సంబంధించిన సేవలు, పంచాయతీ సేవలు కూడా పొందొచ్చు.

మీ సేవా కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన అర్హతలు:

  • మీ సేవా కేంద్రాల నిర్వహణకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు స్థానికుడై ఉండాలి.
  • వయసు 18 నుంచి 35 ఏళ్ల లోపు కలిగి ఉండాలి.
  • కనీస విద్యార్హత డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి..
  • కంప్యూటర్ వాడకం పై అవగాహన కలిగి ఉండాలి.
Show comments