iDreamPost
android-app
ios-app

Vidya Nidhi: విద్యార్థులకు ఉచితంగా రూ.20 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!

  • Published Mar 10, 2024 | 6:22 PM Updated Updated Mar 10, 2024 | 6:22 PM

Ambedkar Overseas Vidya Nidhi: ఉన్నత విద్య అభ్యసించాలనే పేద విద్యార్థుల కలలను నెరవేర్చడానికి ప్రభుత్వం వారికి ఉచితంగా రూ.20 లక్షలు అందించనుంది. అర్హుల నుంచి దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Ambedkar Overseas Vidya Nidhi: ఉన్నత విద్య అభ్యసించాలనే పేద విద్యార్థుల కలలను నెరవేర్చడానికి ప్రభుత్వం వారికి ఉచితంగా రూ.20 లక్షలు అందించనుంది. అర్హుల నుంచి దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 10, 2024 | 6:22 PMUpdated Mar 10, 2024 | 6:22 PM
Vidya Nidhi: విద్యార్థులకు ఉచితంగా రూ.20 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!

ఉన్నత విద్యలు అభ్యసించి, మంచి స్థాయిలో సిర్థపడాలని చాలా మంది విద్యార్థులు కలలు కంటుంటారు. అందుకోసం ఎంతో మంది అహర్నిశలు కష్టపడుతుంటారు. కానీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది వారి కలల కోర్సును చేయలేరు. వీరిలో ఎక్కువగా మంది పేద మధ్యతరగతి ప్రజలే ఉంటారు. ఇలాంటి విద్యార్థులకు మేలు చేస్తూ.. వారి కలలు నేరవేర్చుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం పేరే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. ఈ పథకానికి అర్హులైన వారి నుంచి తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

నిరుపేద ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి ఒక ప్రకటన విడుదల చేశారు. విదేశీ యూనివర్సిటీల్లో చదవాలనుకునే ఎస్సీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడమే ఈ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథక లక్ష్యం. ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి తెలిపారు.

ఈ పథకానిక అర్హత సాధించాలంటే.. అభ్యర్థులు టోఫెల్, జీఆర్ఈ, జీమ్యాట్, పీటీఈ, ఐఈఎల్టిఎస్ ఏదైనా ఒక పరీక్షను రాసి విదేశాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ప్రవేశం పొంది ఉండాలి. అలా అన్ని అర్హతలు ఉన్న ఎస్సీ విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే.. ప్రభుత్వం నుంచి వారికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఈ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.