TSRTC: విద్యార్థులకు మరో శుభవార్త చెప్పిన TSRTC

విద్యార్థులకు మరో శుభవార్త చెప్పిన TSRTC

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే విద్యార్థులకు రాయితీపై బస్ పాసులను అందజేయడమే కాకుండా వివిధ రకాల బస్ పాసులను సైతం అందిస్తుంది. అయితే ఈ క్రమంలోనే విద్యార్థులు అదిరిపోయే శుభవార్తను తెలిపింది. అసలు విషయం ఏంటంటే? రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో విద్యార్థులు ప్రతీ నెల బస్ పాసులను రెన్యూవల్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీని కోసం విద్యార్థులు పడే ఇబ్బందులు వర్ణనాతీతం అనే చెప్పాలి.

గంటలకొద్ది క్యూ లైన్ లో నిలబడి బస్ పాస్ రెన్యూవల్ చేసుకుని వెళ్లాలి. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని TSRTC రెన్యూవల్ ప్రక్రియను మరింత సులభ తరం చేసింది. ఇక నుంచి ఆన్ లైన్ లో చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెన్యూవల్ తో పాటు కొత్త బస్ పాసుకు దరఖాస్తు కూడా చేసుకునే వెసులబాటు కూడా ఉందని తెలిపింది. ఈ విషయం తెలియడంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. ఇన్నాళ్లు బస్ రెన్యూవల్ కోసం పడే ఇబ్బందులు ఇక పోయాయని మురిసిపోతున్నారు. అయితే బస్ పాస్ రెన్యూవల్ కోసం htt://online.tsrtcpass.in వెబ్ సైట్ లో లాగిన్ అయి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదండి: ఉద్యోగులకు KCR సర్కార్‌ మరో శుభవార్త.. వారికి ఏకంగా 30 శాతం పీఆర్సీ

Show comments