iDreamPost
android-app
ios-app

స్కాన్ చేస్తే టీ , కాఫీ, బాదం ఛాయ్ తో పాటు బిస్కెట్స్!

  • Published Jun 11, 2024 | 6:00 PM Updated Updated Jun 11, 2024 | 6:00 PM

Satthupalli RTC Depot: డిగ్రీలు చేసి పట్టా చేత పట్టుకొని ఉద్యోగాల అన్వేషనలో ఉండేవారు ఎంతోమంది ఉన్నారు. ఉద్యోగం కోసం సమయం చేసుకోకుండా సొంత వ్యాపారంతో నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని భావించాడు ఓ యువకుడు.

Satthupalli RTC Depot: డిగ్రీలు చేసి పట్టా చేత పట్టుకొని ఉద్యోగాల అన్వేషనలో ఉండేవారు ఎంతోమంది ఉన్నారు. ఉద్యోగం కోసం సమయం చేసుకోకుండా సొంత వ్యాపారంతో నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని భావించాడు ఓ యువకుడు.

స్కాన్ చేస్తే టీ , కాఫీ, బాదం ఛాయ్ తో పాటు బిస్కెట్స్!

టెక్నాలజీ అభివృద్ది చెందుతున్నా కొద్ది మనిషి కొత్త కొత్త ఐడియాలతో వినూత్న ప్రయోగాలు చేస్తున్నాడు. దేశంలో చాలా మంది డిగ్రీ పూర్తి చేసి సరైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కాలం వృదా చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగం కోసం ఎదురు చూడుకుండా స్వంత బిజినెస్ తో ముందుకు సాగుతున్నారు. డిగ్రీ చేసిన ఓ యువకుడు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి విసిగిపోయాడు. ఇక లాభం లేదు అనుకొని సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని భావించాడు. తాను చేయబోయే వ్యాపారంలో ఏదైన ఒక కొత్తదనం చూపించాలని అనుకున్నాడు. అంతే ఒక అత్యాధునిక టెక్నాలజీతో కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు. ఇంతకీ ఆ నిరుద్యోగి చేసి పనేంటో చూద్దాం.

తెలంగాణ ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలోని ప్రయాణికుల ప్రాంగణంలో టీ, కాఫీ, స్నాక్స్ కావాలనుకునే వారికి ప్రేమ్ కుమార్ అనే ఓ యువకుడు అద్భతమైన రూపకల్పన చేశాడు. ఇప్పుడు ప్రతి చిన్నదానికి డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రేమ్ కుమార్ వైఫై డిజిటల్ టెక్నాలజీ మిషన్ ని అందుబాటులోకి తీసుకువచ్చాడు. 24/7 ప్రయాణికులకు అందుబాటులో ఉంటూ ప్రయాణికులకు కావాల్సిన టీ, కాఫీ, వాటర్ బాటిల్, బాదం పాలు, బిస్కట్లు ఇచ్చేలా డిజిటల్ మిషన్ ని ఏర్పాటు చేశాడు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ప్రోగ్రామింగ్ ఫీడ్ చేసి అమర్చాడు. ఈ మెషన్ కి రూ.4 లక్షల వరకు ఖర్చు అయినట్లు ప్రేమ్ కుమార్ తెలిపాడు.

ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. ‘ ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తూ సమయం వృదా చేయడం ఇష్టం లేక ఈ వ్యాపారంలోకి దిగాను. ఇప్పుడు ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ చేసేవారే ఉన్నారు. అందుకే వారికి అనుకూలంగా ఓ కొత్త మెషన్ ద్వారా టీ, కాఫీ, స్నాక్స్ అన్నీ నిమిషాల్లో అందుబాటులోకి వచ్చేలా ప్రోగ్రామింగ్ చేసిన మెషన్ ని అందుబాటులోకి తీసుకు వచ్చాను. చాలా మంది ప్రయాణికులు తమకు కావాల్సింది నిమిషాల్లో తీసుకుంటున్నారు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది’ అని అన్నాడు. మొత్తానికి కొత్త టెక్నాలజీని ఎలా వాడుకోవాలనో ఈ తరం యువకులకు బాగా అర్థమైందని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.